కేంద్రమంత్రిని కలిసిన శంకర నారాయణ

22 Dec, 2020 21:05 IST|Sakshi

సాక్షి, ఢిల్లీ: కేంద్రమంత్రి నితిన్ గడ్కరీని ఏపీ రోడ్లు, భవనాల మంత్రి శంకర నారాయణ, ఎంపీ కృష్ణదేవరాయలు మంగళవారం కలిశారు. రాష్ట్రంలో 16 పోర్టులకు జాతీయ రహదారుల కనెక్టివిటీ చేయాలని కేంద్రమంత్రికి వినతించారు. అనంతరం మంత్రి శంకర నారాయణ మీడియాతో మాట్లాడుతూ విశాఖ పోర్టు-భోగాపురం ఎయిర్‌పోర్ట్ వరకు కోస్టల్‌ రోడ్‌ మంజూరు చేయాలని కేంద్రమంత్రిని కోరామని వెల్లడించారు. విజయవాడ-బెంగళూరు వరకు గ్రీన్‌ ఫీల్డ్ ఎక్స్‌ప్రెస్‌ వేను ఫేజ్‌-1లో చేపట్టాలని, విజయవాడ కాజా టోల్‌ ప్లాజా-ఒట్టిపాడు వరకు బైపాస్ మంజూరు చేయాలని కోరినట్లు తెలిపారు. రైల్వే అండర్ బ్రిడ్జి, రైల్వే ఓవర్ బ్రిడ్జి నిర్మాణం చేయాలని కోరామని మంత్రి శంకర నారాయణ తెలిపారు.
 

Read latest Andhra-pradesh News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు