‘వికేంద్రికరణతోనే సమగ్రాభివృద్ధి సాధ్యం’

31 Jul, 2020 21:17 IST|Sakshi

సాక్షి, అనంతపురం: పరిపాలన వికేంద్రీకరణకు గవర్నర్ గ్రీన్సిగ్నల్ ఇవ్వటాన్ని స్వాగతిస్తున్నామని మంత్రి శంకర్‌ నారాయణ పేర్కొన్నారు. శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. సీఆర్డీఏ చట్టం రద్దును స్వాగతిస్తున్నామని చెప్పారు. ఏపీలో అన్ని ప్రాంతాల అభివృద్ధి జరగాలన్నదే ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి నిర్ణయమని, ఇందుకు మూడు రాజధానులు ఆయన లక్ష్యం అన్నారు. అదే  విభజన గాయాలు మానాలంటే అధికార, అభివృద్ధి వికేంద్రీకరణ తథ్యమన్నారు. స్వార్థ ప్రయోజనాల కోసమే చంద్రబాబు అమరావతి డ్రామాలు ఆడారని, అమరావతిలో టీడీపీ నేతలు ఇన్ సైడర్ ట్రేడింగ్‌కు పాల్పడ్డారని మంత్రి ధ్వజమెత్తారు. రైతుల కడుపు కొట్టి భూములు లాక్కున్నారని మండిపడ్డారు. సీఎంజగన్ వల్లే ఏపీ సర్వతోముఖాభివృద్ధి సాధ్యమోందని, రాయలసీమలో హైకోర్టు వల్ల ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయని తెలిపారు. నిపుణుల నివేదిక మేరకే మూడు రాజధానుల నిర్ణయం సీఎం జగన్‌ తీసుకున్నారని మంత్రి పేర్కొన్నారు. (చదవండి: మూడు రాజధానులకు రాజముద్ర పడిందిలా..)

పుట్టపర్తి ఎమ్మెల్యే  దుద్దుకుంట శ్రీధర్ రెడ్డి మాట్లాడుతూ... రాజధాని వికేంద్రీకరణ, సీఆర్‌డీఏ బిల్లు రద్దును గవర్నర్ ఆమోదించడం రాష్ట్ర సమగ్రాభివృద్ధికి శుభ సూచకమని ఆనందం వ్యక్తం చేశారు. వెనుకబడిన రాయలసీమ అభివృద్ధికై కర్నూలును న్యాయ రాజధానిగా గుర్తించడాన్ని మనస్ఫూర్తిగా స్వాగతిస్తున్నామని చెప్పారు. రాయలసీమ వాసుల తరుపున సీఎం వైఎస్ జగన్‌కు కృతజ్ఞతలు తెలుకుంటున్నానని వ్యాఖ్యానించారు.  సీఎం జగన్‌ ఆధ్వర్యంలో దివంగత మహానేత వైఎస్సార్ కలలుకన్న రాయలసీమ, లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్‌ను పూర్తిచేసి తీరుతామన్నారు. చంద్రబాబు, టీడీపీ నాయకులు అవినీతితో అమరావతిని నిర్మించాలన్న కలలు కల్లలయ్యాయని ఆయన వ్యాఖ్యానించారు. ఎమ్మెల్యే ఉషశ్రీచరణ్‌ మాట్లాడుతూ: పరిపాలన వికేంద్రీకరణతోనే రాష్ట్ర సమగ్రాభివృద్ధి సాధ్యమని ఆమె హర్షం వ్యక్తం చేశారు. మూడు రాజధానులు, సీఆర్‌డీఏ బిల్లుల రద్దుకు శుక్రవారం గవర్నర్‌ ఆమోదం తెలపడాన్ని ఆమె స్వాగతిస్తున్నట్లు చెప్పారు.

విశాఖపట్నంలో పరిపాలన రాజధాని, అమరావతిలో శాసన రాజధాని, కర్నూలులో న్యాయ రాజధాని ఏర్పాటు చేయడం వల్ల రాష్ట్ర సమగ్రాభివృద్ధి సాధ్యమవుతుందని ఆశభావం వ్యక్తం చేశారు. ఉమ్మడి రాష్ట్రంలో అభివృద్ధి అంతా హైదరాబాద్‌లో ఉండడం వల్ల ఎంతగానో నష్టపోయామని ఈ సందర్భంగా ఎమ్మెల్యే గుర్తు చేశారు. ఇప్పటికీ ఉత్తరాంధ్ర, రాయలసీమ ప్రాంతాలు వెనుకబాటులో ఉన్నాయని, మళ్లీ ప్రాంతీయ ఉద్యమాలు రాకుండా ఉండాలనే ఏకైక లక్ష్యంతోనే మూడు రాజధానులను సీఎం జగన్‌ తీసుకొచ్చినట్ల ఎమ్మెల్యే తెలిపారు. ఎమ్మెల్సీ శమంతకమణి మాట్లాడుతూ... సీఎం వైఎస్‌ జగన్ విజన్ ఉన్న నాయకుడని, ఏపీలో మూడు రాజధానులు ఎంతో అవసరమన్నారు. శాసనమండలిలో బిల్లులు ఆమోదం పొందకుండా చంద్రబాబు కుట్ర పన్నారన్నారు. పరిపాలన వికేంద్రీకరణ బిల్లును ఆమోదించిన గవర్నర్‌కు ఆమె కృతజ్ఞతలు తెలిపారు. కర్నూలులో హైకోర్టు ఏర్పాటు చారిత్రక అవసరమని ఎమ్మెల్సీ పేర్కొన్నారు.

మరిన్ని వార్తలు