వినోదం @ శిల్పారామాలు

26 Dec, 2022 03:55 IST|Sakshi

అమ్యూజ్‌మెంట్‌ పార్క్, స్నో వరల్డ్, స్విమ్మింగ్‌పూల్,వెల్‌నెస్‌ సెంటర్, రెసిడెన్షియల్‌ కాంప్లెక్స్, మల్టీపర్పస్‌ హాల్స్‌ నిర్మాణం

సాక్షి, అమరావతి: దేశ, విదేశీ పర్యాటకులను ఆకర్షిం­చేలా రాష్ట్రంలోని శిల్పారామాలను తీర్చిది­ద్దేం­­దుకు ప్ర­ణాళికలు సిద్ధమవుతున్నాయి. పట్ట­ణాల్లో పల్లె వాతా­వరణాన్ని అందించడంతోపాటు విలాసవంతమైన సౌక­­ర్యాలను కల్పించేలా ప్రభు­త్వం చర్యలు చేపడు­తోంది. చిన్నారులకు సాహస, వినోద కార్య­కలాపా­లకు ప్రాధాన్యమిస్తోంది.

అమ్యూ­­జ్‌­­మెంట్‌ పార్క్, స్నో వరల్డ్, స్విమ్మింగ్‌ పూల్, వెల్‌నెస్‌ సెంటర్‌ (జిమ్, స్పా), రెసిడెన్షియల్‌ కాంప్లెక్స్, మల్టీపర్పస్‌ హాల్స్, ఫుడ్‌ కోర్టులను అందుబాటులోకి తీసుకురా­నుంది. వీటిని విశాఖపట్నం, కాకినాడ, తిరుపతి, పులివెందు­ల, అనంతపురం, పుట్టపర్తి, కడప శిల్పారామాల్లో ప్రభు­త్వ, ప్రైవేటు భాగస్వామ్యంతో వీటిని ఏర్పాటు చేయ­నుంది. ఇందుకోసం టెండర్లు సైతం ఆహ్వానించింది. 

కళాకారులకు ప్రోత్సాహం
కళాకారులు, చేతివృత్తుల వారికి నేరుగా తమ ఉత్ప­త్తులను మార్కెటింగ్‌ చేసుకునే సౌలభ్యాన్ని శిల్పారా­మాల్లో కల్పిస్తున్నారు. హస్తకళల ప్రదర్శన, చేనేత వస్త్రాల ఎగ్జిబిషన్లు, క్రాఫ్ట్‌ బజార్స్, ఎక్స్‌పో, మేళాలను ఉచితంగా ఏర్పాటు చేసుకుని ఉపాధి పొందేలా తోడ్పాటు అందిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే శ్రీకాకుళం, విజయనగరం, కర్నూలు, చిత్తూరులో ప్రభుత్వం అర్బ­న్‌ హట్స్‌ నిర్మాణం చేప­ట్టనుంది.

విశాఖపట్నం, కాకి­నాడ, కడప, పులి­వెందుల, అనంతపురం, పుట్టపర్తి, గుంటూరు శిల్పా­రా­మాల్లో హస్తకళల మ్యూ­జి­యా­లను అందుబాటు­లోకి తేనుంది. ఈ మేరకు కేంద్ర ప్రభు­­త్వానికి ప్రతి­పాదనలు సమర్పించింది. పులివెందులలో రూ.12.26 కోట్లతో శిల్పారామంలో వస­తులను మెరుగుపర్చనున్నారు. అక్కడ సాహస కార్య­కలా­పాలు, విజయనగరం శిల్పారామంలో ఘం­టశాల అకా­డమీ ఏర్పాటుకు సన్నాహాలు జరుగుతు­న్నాయి.

సకల సౌకర్యాల నిలయంగా..
రాష్ట్రంలో శిల్పారామాల వ్యవస్థ పర్యాటక రంగంలో కీలకంగా మారనుంది. అందుకే.. ప్రపంచస్థాయి వినోద, విజ్ఞాన సౌకర్యాలను పీపీపీ విధానంలో అభివృద్ధి చేస్తున్నాం. తద్వారా స్థానిక యువతకు కూడా ఉపాధి లభిస్తుంది. మరోవైపు పేద కళాకారులు, చేతి వృత్తులను ప్రోత్సహించేలా ఉచితంగా మార్కెటింగ్‌ సౌకర్యం కల్పిస్తున్నాం.
– డి.శ్యామ్‌ సుందరరెడ్డి, సీఈవో, శిల్పారామం 

మరిన్ని వార్తలు