ఎస్‌ఈసీ నిమ్మగడ్డకు ఎదురుదెబ్బ

3 Mar, 2021 12:20 IST|Sakshi

సాక్షి, అమరావతి : ఆంధ్రప్రదేశ్‌ ఎన్నికల కమిషనర్‌ నిమ్మగడ్డ రమేష్‌ కుమార్‌కు ఎదురు దెబ్బ తగిలింది. మున్సిపల్‌ ఎన్నికల్లో రీ నామినేషన్‌కు అవకాశం ఇస్తూ జారీ చేసిన ఆదేశాలను బుధవారం హైకోర్టు కొట్టివేసింది. కొత్తగా మున్సిపల్‌ నామినేషన్లకు అవకాశం ఇవ్వొద్దని స్పష్టం చేసింది. మున్సిపల్‌ ఎన్నికలకు సంబంధించి వార్డు వాలంటీర్లపై ఎస్‌ఈసీ జారీ చేసిన ఆదేశాలను కూడా కొట్టేసింది. వాలంటీర్ల ట్యాబ్‌లను స్వాధీనం చేసుకోవద్దని సూచించింది. 

కాగా, తిరుపతి కార్పోరేషన్‌లో ఆరు, పుంగనూరు మున్సిపాలిటీలో మూడు, కడప జిల్లా రాయచోటిలో రెండు ఏకగ్రీవాలలో రీ నామినేషన్‌కు అవకాశం కల్పిస్తూ ఎస్‌ఈసీ సోమవారం ఉత్తర్వులు జారీ చేశారు. నామినేషన్ వేయకుండా అడ్డుకుని బలవంతంగా ఏకగ్రీవం చేయించుకున్నందునే రీ నామినేషన్‌కి అవకాశమిస్తున్నట్లు ఉత్తర్వులలో పేర్కొన్నారు. అంతేకాదు..వార్డు వాలంటీర్లను మున్సిపల్‌ ఎన్నికల విధుల నుంచి దూరంగా ఉంచాలంటూ ఆదేశాలు జారీ చేశారు. వారి ఫోన్లను స్వాధీనం చేసుకోవాలని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.

చదవండి : పంచాయతీ రీ కౌంటింగ్‌పై ఈసీ మరో కీలక ఉత్తర్వు 

మరిన్ని వార్తలు