అనంత ప్రభుత్వ ఆస్పత్రిలో అగ్నిప్రమాదం

26 Aug, 2020 09:02 IST|Sakshi

సాక్షి, అనంతపురం : అనంతపురం ప్రభుత్వ ఆస్పత్రిలో అర్థరాత్రి అగ్నిప్రమాదం జరిగింది. సకాలంలో అధికారులు స్పందించడంతో పెను ప్రమాదం తప్పింది. కోవిడ్‌ వార్డులో పక్కనే ఉన్న రికార్డు  రూమ్‌లో అర్థరాత్రి సమయంలో షార్ట్‌ సర్క్యూట్‌తో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. ఈ ఘటనలో ఫర్నిచర్, రికార్డులు దగ్ధం అయింది. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపు చేశారు. ఐడీ వార్డులో ఉన్న 24మంది కోవిడ్‌ పేషెంట్లను మరో వార్డులోకి తరలించారు. జిల్లా కలెక్టర్‌ సత్య యేసుబాబు, ఎమ్మెల్యే అనంత వెంకటరామిరెడ్డి ప్రమాద స్థలానికి చేరుకుని సహాయక చర్యలను పర్యవేక్షించారు.

అగ్ని ప్రమాదం చోటుచేసుకున్న అనంతపురం ప్రభుత్వాసుపత్రిని ఏపీ డిప్యూటీ సిఎం, వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఆళ్లనాని బుధవారం ఉదయం పరిశీలించారు. స్టేషనరీ గదిలో మంటలు ఎలా చెలరేగాయన్న దానిపై ఆరా తీశారు. ఈ సందర్భంగా ఆసుపత్రి సూపరింటెండెంట్, డీఎం అండ్ హెచ్ఓల నుంచి  ఆళ్లనాని వివరాలు సేకరించారు. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా పటిష్ట చర్యలు తీసుకోవాలని ఆదేశాలు జారీ చేశారు. కోవిడ్ పేషెంట్లకు ఏలోటూ లేకుండా చర్యలు తీసుకోవాలని ఆళ్ల నాని తెలిపారు.



ఖైదీ ఆత్మహత్య
అనంతపురం : జిల్లా జైల్‌లో రిమాండ్‌ ఖైదీ ఆత్మహత్యకు పాల్పడ్డాడు. అక్బర్‌ బాషా లుంగీతో ఉరి వేసుకుని ప్రాణాలు తీసుకున్నాడు. ఈ ఘటనకు సంబంధించి వార్డెన్లు వెంకటకృష్ణ, నవీన్‌కుమార్‌పై అధికారులు సస్పెన్షన్‌ వేటు వేశారు.

మరిన్ని వార్తలు