లుంగీ, షర్టు ధరించి మారు వేషంలో ఎస్‌ఐ.. ఏమైందో తెలుసా?

13 Jan, 2022 11:39 IST|Sakshi
నిందితులతో ఎస్‌ఐ నాగకార్తీక్‌ (లుంగీతో మధ్యలో నిలబడ్డ వ్యక్తి), ఇతర పోలీసు సిబ్బంది

సాక్షి, విశాఖపట్నం: పోలీస్‌ డ్రెస్సులో దాడికి వెళుతుంటే కోడి పందేల నిర్వాహకులు ముందే అప్రమత్తమవుతున్నారని ఎస్‌ఐ మారు వేషంలో ప్రత్యక్షమయ్యారు. లుంగీ, షర్టు ధరించి సామాన్య గ్రామీణుడిలా వెళ్లడంతో ఆయననెవరూ గుర్తు పట్టలేదు. కోడి పుంజులతో సహా సునాయాసంగా నిందితులను పట్టుకున్నారు. ఈ ఘటన రోలుగుంటలో బుధవారం రాత్రి జరిగింది.

చదవండి: సంక్రాంతి: గంగిరెద్దులతో మాట్లాడగల నేర్పరులు

స్థానిక ఎస్‌ఐ బి.నాగకార్తీక్‌ సిబ్బందితో కలిసి ఇలా వినూత్న రీతిలో ఎం.కె.పట్నం పరిసర ప్రాంతంలోని కోడి పందెం స్థావరాలపై దాడి చేశారు. ఈ దాడిలో ఇద్దరు వ్యక్తులు పట్టుబడగా వారి నుంచి రెండు కోడి పుంజులు, రూ.510 లను స్వాధీనం చేసుకొని కేసు నమోదు చేశారు.

మరిన్ని వార్తలు