ప్రేమికుడు మిస్‌, అతని తండ్రిపై దాడి

20 Oct, 2020 13:17 IST|Sakshi

సాక్షి, అనంతపురం: హిందూపురంలోని మోడల్‌ కాలనీలో మంగళవారం ఉదయం దారుణం జరిగింది. చెల్లిని ప్రేమిస్తున్నాడన్న అక్కసుతో అమ్మాయి అన్న కిరాతకంగా ప్రవర్తించాడు. అబ్బాయి తండ్రిపై కత్తితో విచక్షణారహితంగా దాడి చేశాడు. వివరాలు.. కుటుంబంతో కలిసి చాంద్‌ బాషా మోడల్‌ కాలనీలో నివాసం ఉంటున్నాడు. మంగళవారం ఉదయం అజకర్‌, అతని స్నేహితుడితో కలిసి చాంద్‌ బాషా ఇంటిపైకొచ్చి ఘర్షణకు దిగాడు. తన చెల్లితో ప్రేమ వ్యవహారం నడిపిస్తున్న నీ కొడుకు సైపుల్లాను అంతం చేస్తానని కత్తి చేతబట్టి బెదిరింపులకు దిగాడు. అయితే, ఒకరికొకరు ఇష్టపడుతున్నన్న యువతీయువకులకు పెళ్లి చేద్దామని చాంద్‌ బాషా నచ్చజెప్నే యత్నం చేయడంతో అజకర్‌ కోపంతో రగలిపోయాడు. అదే సమయంలో ఇంట్లో సైపుల్లా కూడా లేకపోవడంతో చాంద్‌ బాషాపై‌, తన స్నేహితుడితో కలిసి అజకర్‌ కత్తితో దాడికి దిగాడు. చాంద్‌ బాషా చేతులు, కాళ్లపై తీవ్ర గాయాలయ్యాయి. కుటుంబ సభ్యులు అతన్ని ఆసుపత్రికి తరలించారు.
(చదవండి: విషాదం: ప్రేమ జంట ఆత్మహత్య)

Read latest Andhra-pradesh News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా