టీడీపీ సర్కార్‌లో భూస్కాం.. నివేదిక సిద్ధం

22 Dec, 2020 15:59 IST|Sakshi

త్వరలోనే ప్రభుత్వానికి సిట్‌ రిపోర్టు

400 ఎకరాల్లో భూ అక్రమాలు

 సాక్షి, అమరావతి : టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో జరిగిన భూ అక్రమాలపై ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్‌) విచారణ పూర్తయింది. టీడీపీ హయాంలో చోటుచేసుకున్న భూ కుంభకోణంపై సుదీర్ఘ విచారణ జరిపిన సిట్‌.. పెద్ద ఎత్తున భూములు ఆక్రమణకు గురైనట్లు గుర్తించింది. ఈ మేరకు విచారణ పూర్తిఅయినట్లు సిట్‌ చైర్మన్‌ విజయ్‌ కుమార్‌ మంగళవారం మీడియా సమావేశం ద్వారా వెల్లడించారు. కరోనా వైరస్‌ కారణంగా విచారణ కొంతమేర ఆలస్యమైందని, ముఖ్యమంత్రి కార్యాలయం నుంచి పిలుపు రాగానే నివేదికను అందిస్తామని తెలిపారు. తుది నివేదికను ప్రభుత్వానికి సమర్పించేందుకు అంతా సిద్ధంగా ఉంచామన్నారు. విశాఖ రెవెన్యు డివిజన్ పరిధిలో భూ అక్రమాలపై పూర్తి స్థాయిలో విచారణ చేశామన్నారు. (9 కంపెనీలు.. 9 బ్యాంకులు.. రూ.9వేల కోట్లు)

ప్రభుత్వ భూములు కేటాయింపులు, రికార్డులు ట్యామ్ పరింగ్, ఎన్ఓసీ జారీ, 22A భూములు అక్రమాలు జరిగాయని వెల్లడించారు. మొత్తం 350 నుంచి 400 ఎకరాల్లో భూములు అక్రమాలు జరినట్లు గుర్తించామన్నారు. 22A నిషేధిత భూములు విషయంలో భారీగా అక్రమాలు చోటు చేసుకున్నాయని పేర్కొన్నారు. ఉడా బహిరంగ వేలం వేసి అమ్మిన 10 ఎకరాలు భూమిని 22 A నిషేధిత భూముల్లో చేర్చారని అన్నారు. దీనివల్ల కొనుగోలు చేసిన ప్రజలు చాలా ఇబ్బందులు పడ్డారని వివరించారు. రెవెన్యూ అధికారులు సహకారంతో చాలా అక్రమాలు పాల్పడ్డారని చెప్పారు. 22A భూములు విషయంలో స్పష్టమైన పరిష్కరంతో పాటు సిట్‌ ద్వారా సూచనలు కూడా చేస్తున్నామన్నారు. (గీతం అక్రమాలపై సీబీఐకి ఫిర్యాదు)

సిట్‌ విచారణపై కమిటీ సభ్యురాలు వైవీ అనురాధ మాట్లాడుతూ.. ‘సిట్ దృష్టికి 1340 కు పైగా ఫిర్యాదులు వచ్చాయి. రెవెన్యూ రిపోర్ట్స్ జతచేసి ప్రతి అంశం క్షుణ్ణంగా పరిశీలన చేసి నివేదికలో ఇచ్చాము. నిషేధిత భూములు 22 A లో చాలా అక్రమాలు జరిగాయి. 500 పైగా రెవెన్యూ  రికార్డులు తారు మారు చేశారు. 300 కు పిటిషన్లు పైగా 22 A నిషేధిత భూములు అక్రమాలు జరిగాయి’ అని అన్నారు.

సిట్ దృష్టికి వచ్చిన ప్రతి ఫిర్యాదు ను పరిశీలించాము. సిట్ నివేదికలో అన్ని విషయాలు, సూచనలు పొందు పరిచాము.. - భాస్కరరావు..రిటైర్డ్ జడ్జి.. సిట్ సభ్యులు

మరిన్ని వార్తలు