పేపర్‌ చదువుతున్నట్టు నటన, పిల్లాడిని తీసుకుని పరార్‌

3 Mar, 2021 15:23 IST|Sakshi

బాలుడి ఆచూకీ కోసం ప్రత్యేక బృందాలు

తిరుపతి : అలిపిరి లింక్ బస్టాండు వద్ద ఆరేళ్ల బాలుడు అపహరణకు గురి కావడం కలకలం రేపుతోంది. పోలీసుల వివరాల ప్రకారం.. చత్తీస్‌గఢ్‌‌ నుంచి గతనెల 27న  శివమ్ కుమార్ సాహు కుటుంబం శ్రీవారి దర్శనార్థం తిరుపతికి వచ్చింది. ఈ నేపథ్యంలో తిరుమల వెళ్లబోతూ ఫుట్‌పాత్‌ మీద కాసేపు సేదతీరుతున్న సమయంలో బాలుడు కనిపించకుండా పోయాడు. దీంతో పోలీసులకు ఫిర్యాదు చేయగా..ఆ సమయంలో వారి పక్కనే పేపర్‌ చదువుతున్నట్టు నటించిన ఓ వ్య​క్తి బాలుడిని కిడ్నాప్‌ చేసినట్లు సీసీటీవీ కెమెరాల్లో రికార్డు అయ్యింది. బాలుడి వెంటబెట్టుకుని దుండగుడు వెళ్తున్న దృశ్యాలను పోలీసులు పరిశీలిస్తున్నారు. బాలుడి ఆచూకీ కోసం పోలీసులు ప్రత్యేక బృందాలుగా ఏర్పడి గాలిస్తున్నారు. 

చదవండి : (భార్యను నరికి చంపి, ఆపై ఆత్మహత్య)
(హైదరాబాద్‌లో టెకీపై యువకుడి దారుణం)

Read latest Andhra-pradesh News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు