గ‌జ‌వాహ‌నంపై ద‌ర్శ‌న‌మిచ్చిన శ్రీవారు

21 Oct, 2020 19:52 IST|Sakshi

సాక్షి, తిరుమ‌ల : శ్రీవారి నవరాత్రి బ్రహ్మోత్సవాలలో భాగంగా ఆరవ రోజు రాత్రి స్వామి వారు గజవాహనంపై భక్తులకు దర్శనమిచ్చారు.  కోవిడ్-19 కారణంగా ఆలయంలోని కళ్యాణోత్సవ మండపంలో ఏకాంతంగా వాహన సేవల‌ను ఆలయ అర్చకులు నిర్వహించారు. గజం అంటే  అహాంకారానికి ప్రతీక.   ప్రతిమనిషి గజరాజును అదర్శంగా తీసుకొని తమలోని అహాంకారాలను వీడనాడి స్వామిశరణు కొరాలన్నదే గజవాహన సేవలోని అంతర్యం. గజేంద్రమోక్షంలో తనను శరణు కోరిన గజేంద్రుడిని మొసలి బారి నుంచి కాపాడిన్నట్లే, తన పాదాలను ఆశ్రయించిన భక్తులను అన్నివేళల తానే కాపాడుతానని శ్రీనివాసుడు గజంను అధిరోహిస్తారు. రాజుల కాలం నుంచి చతురంగ బలంలో గజం బలం ఒకటి. కర్మబంధం నుంచి విముక్తి పొందేందుకు గోవిందుడే దిక్కన్నట్లు సాగుతుంది గజవాహన సేవ.

మరిన్ని వార్తలు