AP: గ్రామీణాభివృద్ధిశాఖకు మరో స్కోచ్‌ అవార్డు 

25 May, 2023 07:04 IST|Sakshi

గ్రామీణ ప్రాంతాల్లో చెరువుల తవ్వకానికి ఈ ఏడాది సిల్వర్‌ అవార్డు 

అమృత్‌ సరోవర్‌లో ఏడాదిలో 1,810 చెరువుల నిర్మాణం 

ఈ నెలాఖరుకు పూర్తికానున్న మరో 140 చెరువుల పనులు  

గత ఏడాది ఈ శాఖ పరిధిలో కార్యక్రమాలకు 6 స్కోచ్‌ అవార్డులు 

సాక్షి, అమరావతి: రాష్ట్ర గ్రామీణాభివృద్ధిశాఖ మరో స్కొచ్‌ అవార్డును సొంతం చేసుకుంది. గ్రామీణ ప్రాం­తాల్లో వర్షపు నీటిని పెద్ద ఎత్తున నిల్వచేసుకునే ప్రక్రియలో భాగంగా అమృత్‌ సరోవర్‌ కార్యక్రమం అమలుకుగాను 2023 సంవత్సరానికి స్కోచ్‌ సిల్వర్‌ అవార్డుకు రాష్ట్రం ఎంపికైంది.

దేశానికి స్వాతంత్య్రం వచ్చి 75 ఏళ్లయిన సందర్భంగా ఒక్కో జిల్లాలో 75 వంతున రాష్ట్రంలోని 26 జిల్లాల్లో మొత్తం 1,950 చెరువులను ఈ కార్యక్రమంలో ఉపాధి పథకం ద్వారా నిరి్మంచాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. ఇప్పటికే 1,810 చెరువుల నిర్మాణం పూర్త­యింది. ఈ నెలాఖరుకల్లా మిగిలిన 140 చెరువుల నిర్మాణం పూర్తవుతుందని గ్రామీణాభివృద్ధిశాఖ అధి­­­కా­రులు వెల్లడించారు.

స్కోచ్‌ సిల్వర్‌ అవార్డుకు రాష్ట్రం ఎంపికైన విషయాన్ని స్కోచ్‌ సంస్థ ప్రతినిధులు బుధవారం రాష్ట్ర గ్రామీణాభివృద్ధిశాఖకు తెలి­­­పారు. గ్రామీణ ప్రాంతాల్లో పేదరిక నిర్మూలనకు సీఎం వైఎస్‌ జగన్‌ చేపట్టిన కార్యక్రమాలకు గత ఏడాది గ్రామీణాభివృద్ధిశాఖ పరి­ధిలో ఉండే గ్రామీణ పేదరిక నిర్మూలన సంస్థ (సెర్ప్‌)­­తో పాటు వివిధ జిల్లాల డీఆర్‌డీఏలకు ఆరు స్కోచ్‌ అవార్డులు దక్కిన విషయం తెలిసిందే.

ఇది కూడా చదవండి: సీఎం జగన్‌ను కలిసిన జర్మనీ కాన్సుల్‌ జనరల్‌ మైకేలా కుచ్లర్‌

మరిన్ని వార్తలు