గంజి నాగప్రసాద్‌ కుటుంబానికి రూ.25 లక్షల ఆర్థిక సాయం

18 Aug, 2022 15:48 IST|Sakshi
నాగప్రసాద్‌ కుటుంబానికి నగదు చెక్కును అందజేస్తున్న ఎంపీ మార్గాని, ఎమ్మెల్యే తలారి

ఇప్పటివరకు ఏ రాజకీయ పార్టీ అందించని విధంగా చేయూత

సీఎం జగన్‌ను ప్రశంసిస్తున్న బాధిత కుటుంబం  

సాక్షి, ద్వారకాతిరుమల: వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీలో కష్టపడి పనిచేసే ఏ ఒక్క నాయకుడిని, అతడి కుటుంబాన్ని ఆ పార్టీ విడిచిపెట్టదని చెప్పడానికి గంజి నాగప్రసాద్‌ కుటుంబానికి అందించిన చేయూతే ఒక ఉదాహరణ. ఏలూరు జిల్లాలోని ద్వారకాతిరుమల మండలం జి.కొత్తపల్లిలో మూడునెలల కిందట వైఎస్సార్‌సీపీ నేత గంజి నాగప్రసాద్‌ హత్యకు గురైన విషయం తెలిసిందే. వైఎస్సార్‌సీపీ రీజనల్‌ కోఆర్డినేటర్‌ పెద్దిరెడ్డి మిథున్‌రెడ్డి ఆ ఘటనపై తీవ్రంగా స్పందించారు. 

ఈ ఏడాది జూలై 3వ తేదీన కొవ్వూరులో జరిగిన వైఎస్సార్‌సీపీ జిల్లా ప్లీనరీలో నాగప్రసాద్‌ కుమారుడు ఉదయఫణికుమార్‌కు ఆయన రూ.15 లక్షల చెక్కు అందించారు. అలాగే మరో రూ.10 లక్షల చెక్కును మిథున్‌రెడ్డి ఆదేశాల మేరకు ఈ నెల 16న రాజమండ్రి ఎంపీ మార్గాని భరత్‌రామ్, గోపాలపురం ఎమ్మెల్యే తలారి వెంకట్రావు బాధిత కుటుంబానికి అందజేశారు. 

ఈ సందర్భంగా నాగప్రసాద్‌ కుమారుడు ఉదయఫణికుమార్‌ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి, ఎంపీ భరత్‌రామ్, ఎమ్మెల్యే తలారి వెంకట్రావు, మిథున్‌రెడ్డి, రాజీవ్‌కృష్ణ, జీవీ, చెలికాని రాజబాబు, ప్రతాపనేని వాసు తదితరులకు ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలిపారు. తమ కుటుంబాన్ని ఆర్థికంగా ఆదుకున్న వైఎస్సార్‌సీపీకి తాము రుణపడి ఉంటామని చెప్పారు. (క్లిక్: ప్రభుత్వ పాఠశాలల్లో ‘స్పోకెన్‌ ఇంగ్లిష్‌’ క్లాసులు)

మరిన్ని వార్తలు