సముద్రంలో స్వల్ప భూకంపం

23 Jan, 2022 04:41 IST|Sakshi
ప్రతీకాత్మక చిత్రం

సాక్షి, విశాఖపట్నం: బంగాళాఖాతంలో స్వల్ప భూ ప్రకంపనలు నమోదయ్యాయి. శనివారం మధ్యాహ్నం 2.16 గంటల ప్రాంతంలో శ్రీకాకుళం జిల్లాకు 121 కి.మీ. దూరంలోను, ఒడిషాకు 161 కి.మీ., పూరీకి 230 కి.మీ. దూరంలో భూకంప కేంద్రం ఉన్నట్లు అధికారులు గుర్తించారు. రిక్టర్‌ స్కేలుపై దీని తీవ్రత 4.5గా నమోదైనట్లు తెలిపారు. అయితే.. భూమికి 100 కి.మీ. లోతులో ఈ ప్రకంపనలు రావడంతో పెద్దగా ప్రభావం చూపలేదని నేషనల్‌ సెంటర్‌ ఫర్‌ సిస్మాలజీ స్పష్టం చేసింది. భూ అంతర్భాగంలో శిలల మధ్య జరిగిన సర్దుబాటు కారణంగా ఈ ప్రకంపనలు వచ్చినట్లు జియాలజీ విభాగ నిపుణులు చెబుతున్నారు. 

మరిన్ని వార్తలు