తోపుడుబండి వ్యాపారి.. మునిసిపల్‌ చైర్మన్‌

19 Mar, 2021 10:35 IST|Sakshi

కళ్యాణదుర్గం రూరల్‌: తోపుడు బండిపై బొప్పాయి, మామిడి, కర్బూజ తదితర పండ్లు విక్రయించే ఓ చిరు వ్యాపారిని మునిసిపల్‌ చైర్మన్‌ పీఠం వరించింది. అనంతపురం జిల్లా కళ్యాణదుర్గం మున్సిపల్‌ చైర్మన్‌గా తలారి రాజ్‌కుమార్‌ ఎన్నికయ్యారు. ఇంటర్‌ చదివిన రాజ్‌కుమార్‌కు భార్య విజయలక్ష్మి, కుమారుడు, కుమార్తె ఉన్నారు. కుటుంబ పోషణకు తోపుడుబండిపై పండ్లు విక్రయిస్తూ జీవనం సాగిస్తున్నారు.

వైఎస్సార్‌సీపీపై అభిమానంతో కార్యకర్తగా సేవలందిస్తున్నారు. మునిసిపల్‌ ఎన్నికల్లో 10వ వార్డు బీసీ జనరల్‌కు రిజర్వు కాగా.. వైఎస్సార్‌సీపీ టికెట్‌ రాజ్‌కుమార్‌కు లభించింది. ఎన్నికల్లో పోటీకైతే దిగాడు కానీ కనీస ఖర్చు కూడా పెట్టుకునే ఆర్థిక స్థోమత లేకపోయింది. దీంతో ఇంటింటికీ తిరుగుతూ పేదోడిని ఆదరించాలంటూ ఓటర్లను వేడుకున్నారు. సీఎం వైఎస్‌ జగన్‌పై ప్రజలకున్న అభిమానం రాజ్‌కుమార్‌కు ఓట్ల వర్షం కురిపించి కార్పొరేటర్‌గా గెలిపించింది. ఇప్పుడు ఏకంగా మునిసిపల్‌ చైర్మన్‌గా ఎన్నికయ్యారు.
చదవండి:
నాడు కట్టెలు కొట్టిన మహిళ.. నేడు చిత్తూరు మేయర్‌ 
మామ అటెండర్‌గా పనిచేసిన చోట..నేడు కోడలు మేయర్‌

మరిన్ని వార్తలు