అప్పుడు ఎన్టీఆర్‌కు వెన్నుపోటు.. ఇప్పుడు అదే వయసులో బాబు జైలుపాలు

11 Sep, 2023 04:26 IST|Sakshi

ఎన్టీఆర్‌ ఆత్మ శాంతించిందన్న ఆయన అభిమానులు

అప్పట్లో 73 ఏళ్ల వయసులో ఎన్టీఆర్‌కు వెన్నుపోటు..

ఇప్పుడు అదే వయసులో బాబు జైలుపాలు

ఎన్నో కన్నీళ్ల ఉసురిది అంటూ పోస్టుల వెల్లువ

సాక్షి, అమరావతి: స్కిల్‌ డెవలప్‌మెంట్‌ కుంభకోణంలో ఏసీబీ కోర్టు చంద్రబాబుకు రిమాండ్‌ విధించడంతో మాజీ సీఎం నందమూరి తారక రామారావు (ఎన్టీఆర్‌) అభిమానులు సోషల్‌ మీడియాలో పోస్టులు హోరెత్తించారు. ఎన్టీఆర్‌ ఆత్మశాంతించిందంటూ తెగ పోస్టులు పెట్టారు. వెన్నుపోటు పొడిచి సీఎం పదవిని, టీడీపీని చంద్రబాబు లాక్కుని ఎన్టీఆర్‌ మరణానికి కారణమయ్యారని గుర్తుచేస్తు­న్నారు.

ఎన్టీఆర్‌కు కరెక్ట్‌గా 73 ఏళ్ల వయసులో బాబు వెన్నుపోటు పొడవగా... ఇప్పుడు అదే 73 ఏళ్ల వయసులో బాబు జైలు పాలయ్యాడన్నారు. ఖర్మ ఫలితం అంటే ఇదేనని ఫేస్‌బుక్, ఇన్‌స్టా, ట్విట్టర్‌లలో పోస్టులు పెట్టారు. ‘‘ఈ చోటి కర్మ ఈ చోటే ఈనాటి కర్మ మరునాడే అనుభవించి తీరాలంతే ఈ సృష్టి నియమం ఇదే.. ఎన్ని కన్నీళ్ల ఉసురిది.. వెంటాడుతోంది..’’ అనే పాట బ్యాక్‌గ్రౌండ్‌తో 1995 బాబు వెన్నుపోటు ఘటన నాటి వైశ్రాయి హోటల్‌ ముందు ఎన్టీఆర్‌ వీడియోలు, ఫొటోల పోస్టింగ్స్‌తో అభిమానులు హర్షాతిరేఖాలు వ్యక్తంచేశారు.

గోదావరి పుష్క­రాల సమయంలో తన ప్రచారం కోసం 30 మంది ప్రాణాలను బలిగొన్నాడని.. అప్పుడు చేసిన పాపాలకు ప్రతిఫలం అనుభవించమని దేవుడు చంద్రబాబును రాజమండ్రి పంపిస్తున్నాడనే ప్రచారం సోషల్‌ మీడియాలో కొనసాగింది. వంగవీటి రంగా, కారంచేడు మారణహోమంలో బలైన దళితులు, బషీర్‌బాగ్‌ కాల్పుల్లో చనిపోయిన అమాయకుల ఆత్మలు సైతం శాంతించాయని మరికొందరు తమ పోస్టుల ద్వారా సంతోషం వ్యక్తంచేశారు. అలాగే, చంద్రబాబుకు 14 రోజుల పాటు రిమాండ్‌ విధించడంపై.. తన అల్లుడికి తగిన బుద్ధి చెప్పిన ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ను సీనియర్‌ ఎన్టీఆర్‌ ఆశీర్వదిస్తున్నట్లు కార్టూన్లు, మీమ్‌లను నెటిజన్లు అత్యధికంగా షేర్‌ చేస్తున్నారు.

రెండోరోజూ ట్విట్టర్‌లో ట్రెండింగ్‌
ఇక వరుసగా రెండోరోజూ ట్విట్టర్‌లో చంద్రబాబు అరెస్టు ట్వీట్లు ట్రెండింగ్‌గా నిలిచాయి. చంద్రబాబు అరెస్టు, స్కాంస్టర్‌ చంద్రబాబు, చంద్రబాబునాయుడు, స్కిల్‌ డెవలెప్‌మెంట్‌ స్కాం వంటి హ్యాష్‌ ట్యాగ్‌లైన్లు భారీగా ట్రెండింగ్‌ అయ్యాయి. ఇండియా–పాకిస్థాన్‌ మ్యాచ్‌ కంటే బాబు అరెస్టు వార్తలే టాప్‌ ట్రెండింగ్‌లో నిలిచాయి.  

మరిన్ని వార్తలు