గ్రహణ ప్రభావం.. ఆశ్చర్యం, ఆ వింతని చూసేందుకు ఎగబడ్డ జనం!

26 Oct, 2022 11:02 IST|Sakshi

రామకుప్పం: మండలంలోని కెంచనబళ్ల పంచాయతీ, రెడ్డివానిపోడు గ్రామానికి చెందిన కర్ణ కుటుంబీకులు పూర్వీకుల కాలం నుంచి సూర్యగ్రహణం రోజు రోలుకు పూజలు చేసి రోకలిని నిలబెట్టేవారు. మంగళవారం సూర్యగ్రహణం వేళల్లో రోలుకు పూజలు చేసి అందులో నీరుపోసి రోకలిని నిలబెట్టారు.

గ్రహణ ప్రభావం ఉండడం చేత రోకలి ఎటువంటి సపోర్టు (ఆధారం) లేకుండా రోలు మీద నిటారుగా నిలబడింది. గ్రహణ సమయంలో రోలు నుంచి రోకలిని వేరుచేసి తట్టలో నింపిన కుంకుమ నీళ్లలో రోకలిని నిలబెట్టగా రోకలి నిటారుగా నిలబడింది. రోకలిని చూడడానికి ప్రజలు తండోపతండాలుగా తరలివచ్చారు.

ఇదే వింత కృష్ణా, ఎన్టీఆర్‌ జిల్లాలో
సూర్యగ్రహణం సందర్భంగా కృష్ణా, ఎన్టీఆర్‌ జిల్లాలో అన్ని ఆలయాలు మంగళవారం మూతపడ్డాయి. కృష్ణా జిల్లా కోడూరు మండలం స్వతంత్రపురం, మండల కేంద్రమైన తోట్లవల్లూరులో గ్రహణం ప్రభావంతో ఎటువంటి ఆధారం లేకుండా రోకళ్లు నిలబడటం స్థానికులను సంభ్రమాశ్చర్యాలకు గురిచేసింది.

చదవండి: పెళ్లి కాకుండానే బిడ్డకు ప్రసవం.. క్యాంటమ్‌ కంపెనీ బాత్‌రూమ్‌లో శిశువు కలకలం


 

మరిన్ని వార్తలు