మీ దగ్గర ఆధారాలున్నాయా?.. ఏబీఎన్‌ రాధాకృష్ణపై సోము వీర్రాజు ఫైర్‌!

28 Sep, 2022 15:23 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌: బీజేపీ నేతలపై తప్పుడు రాతల విషయంలో ఏబీఎన్‌ రాధాకృష్ణపై ఏపీ బీజేపీ చీఫ్‌ సోము వీర్రాజు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా, సోము వీర్రాజు లేఖ రాశారు. ఈ లేఖలో ‘విద్వేషపూరిత కథనాలతో బీజేపీ ప్రతిష్టకు భంగం కలిస్తారా?. అవినీతిపై ఆధారాలు లేకుండా కథనాలు ప్రచురిస్తారా?. బీజేపీ నేతలు అవినీతికి పాల్పడినట్టు మీ దగ్గర ఆధారాలున్నాయా?. మీ రచనలు ‘ఎల్లో జర్నలిజం’గా కనిపిస్తున్నాయి. వారంలోగా ఆధారాలు చూపాలి. లేకుంటే క్షమాపణలు చెప్పాలి. వారంలో స్పందన లేకుంటే చట్టపరమైన చర్యలకు దిగుతాము’ అని వ్యాఖ్యలు చేశారు.  

 
 

మరిన్ని వార్తలు