చంద్రబాబు ఎవరినైనా మేనేజ్ చేయగలరు..

5 Nov, 2020 12:26 IST|Sakshi

ఏపీ బీజేపీ అధ్యక్షుడు సోము వీర్రాజు

సాక్షి, తూర్పుగోదావరి: ప్రతిపక్ష నేత చంద్రబాబుపై ఏపీ బీజేపీ అధ్యక్షుడు సోము వీర్రాజు నిప్పులు చెరిగారు. గురువారం ఆయన మీడియాతో మాట్లాడుతూ చంద్రబాబే పోలవరం కాంట్రాక్టరుగా ఉన్నారని గతంలో ఒక కేంద్ర మంత్రే వ్యాఖ్యానించారని ఆయన గుర్తు చేశారు. 48 వేల కోట్ల మేర అంచనాలు ఇష్టారీతిన పెంచేశారు. చంద్రబాబు ఎవరినైనా మేనేజ్ చేయగలరని, లెఫ్ట్ కెనాల్ , రైట్ కెనాల్ లో భారీ అవినీతి చోటు చేసుకుందని ధ్వజమెత్తారు. ‘‘రూ.5 కోట్ల వ్యయాన్ని గత ప్రభుత్వం  రూ.25 కోట్లకు పెంచేసింది. యనమల వియ్యంకుడికి ఈ పనులు అప్పజెప్పారు. అంచనాలు 50 కోట్ల పెరిగిపోయాయి. ప్రభుత్వ భూములను గత ప్రభుత్వం ప్రైవేటు భూములుగా చూపించింది. గత ప్రభుత్వం పోలవరం కాంటూరు లెవెల్స్ పెంచేసింది. దీంతో దేవీపట్నం మునిగిపోయింది. పోలవరం డబ్బుతో ఒక టీడీపీ ఎమ్మెల్యే మూడు అపార్ట్‌మెంట్లు కట్టారు. పోలవరం డబ్బు 10 కోట్లతో విజయవాడలో భారీ గెస్ట్ హౌస్  కట్టారని సోము వీర్రాజు ఆరోపించారు. (చదవండి: టీడీపీ నేతలు మా వైపు చూస్తున్నారు)

మరిన్ని వార్తలు