చంద్రబాబు.. రూ. 6,500 కోట్లు ఏం చేశావో చెప్పాలి: సోము వీర్రాజు

27 Sep, 2022 14:30 IST|Sakshi

సాక్షి, గుంటూరు: టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడిపై ఏపీ బీజేపీ అధ్యక్షుడు సోము వీర్రాజు సంచలన వ్యాఖ్యలు చేశారు. రాజధాని పేరుతో చంద్రబాబు.. ప్రజల డబ్బంతా వృధా చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. 

కాగా, బీజేపీ అధ్యక్షుడు సోము వీర్రాజు మంగళవారం మీడియాతో మాట్లాడుతూ.. ‘కేంద్రం ఇచ్చిన రూ. 6,500 కోట్లు ఏం చేశారో చంద్రబాబు చెప్పాలి. రూ. 1800 కోట్లతో కేంద్రం ఎయిమ్స్‌ నిర్మించింది. అయితే, కేంద్రం నిర్మించిన ఎయిమ్స్‌ బాగుందో లేక చంద్రబాబు రాజధాని బాగుందో చర్చకు రావాలి. రాజధాని పేరు చెప్పి చంద్రబాబు ప్రజలను మోసం చేశారు. అధికారంలో ఉన్నప్పుడు చంద్రబాబు.. సింగపూర్‌, మలేషియా, జపాన్‌ అంటూ దేశాలు తిరిగి వచ్చాడు. వేల కోట్లు ఖర్చు చేశాడు. కానీ.. రాజధానిని మాత్రం ఎందుకు కట్టలేదు’ అని ప్రశ్నించారు.  

ఇది కూడా చదవండి: ఆనాడు దానిని అడ్డుకుంది చంద్రబాబే.. అందుకు నేనే ప్రత్యక్ష సాక్షిని: యార్లగడ్డ లక్ష్మీప్రసాద్‌

మరిన్ని వార్తలు