ప్రత్యేక రైళ్ల కేటాయింపు

8 Jun, 2022 06:13 IST|Sakshi

లక్ష్మీపురం (గుంటూరు వెస్ట్‌): దక్షిణ మధ్య రైల్వే గుంటూరు డివిజన్‌ మీదుగా హటియా –సికింద్రాబాద్‌–హటియా ప్రత్యేక రైలును నడపనుందని డివిజన్‌ సీనియర్‌ డీసీఎం మంగళవారం వెల్లడించారు. 08615 నంబర్‌ రైలును హటియా–సికింద్రాబాద్‌ వయా గుంటూరు డివిజన్‌ మీదుగా ఈ నెల 10వ తేదీ శుక్రవారం కేటాయించినట్లు తెలిపారు.

ఈ రైలు హటియా స్టేషన్‌ నుంచి శుక్రవారం రాత్రి 11.55 గంటలకు బయల్దేరి ఆదివారం ఉదయం 5.30 గంటలకు గుంటూరుకు చేరుకుని అక్కడ నుంచి సికింద్రాబాద్‌ స్టేషన్‌కు ఉదయం 11.30 గంటలకు చేరుకుంటుందని తెలిపారు. 08616 నంబర్‌ రైలును సికింద్రాబాద్‌–హటియాకు 13న కేటాయించినట్లు తెలిపారు. ఈ రైలు సికింద్రాబాద్‌ స్టేషన్‌ నుంచి సోమవారం రాత్రి 7.30కి బయల్దేరి బుధవారం ఉదయం 6 గంటలకు హటియా స్టేషన్‌కు చేరుకుంటుందని తెలిపారు. 

పలు రైళ్లు తాత్కాలిక రద్దు
డబ్లింగ్‌ పనులు జరుగుతున్న కారణంగా పలు రైళ్లు రద్దు చేస్తున్నట్లు డివిజన్‌ సీనియర్‌ డీసీఎం వెల్లడించారు. లింగంపల్లి–విశాఖపట్నం 12806 నంబర్‌ రైలు ఈ నెల 18న విజయవాడ–విశాఖపట్నం మీదుగా తాత్కాలికంగా రద్దయిందన్నారు. అలాగే విశాఖపట్నం–లింగంపల్లి 12805 నంబర్‌ రైలు విశాఖపట్నం–విజయవాడ మీదుగా తాత్కాలికంగా రద్దు చేసినట్లు తెలియజేశారు.  

మరిన్ని వార్తలు