Tirupati: ప్రయాణికులకు పది ప్రత్యేక రైళ్లు

20 Aug, 2022 14:34 IST|Sakshi

సాక్షి, తిరుపతి అర్బన్‌: తిరుపతి మీదుగా నడుస్తున్న మరో పది ప్రత్యేక రైళ్లను దక్షిణ మధ్య రైల్వే అందుబాటులోకి తీసుకొస్తోంది. కరోనా కారణంగా 2020–21లో పలు రైళ్లు రద్దు చేసిన విషయం తెల్సిందే. మహమ్మారి తగ్గుముఖం పట్టిన తర్వాత కొన్ని రైళ్లు పునరుద్ధరించినప్పటికీ ప్రత్యేక రైళ్లు వందశాతం అందుబాటులోకి రాలేదు. తాజాగా అన్ని ప్రత్యేక రైళ్లను ప్రయాణికులకు అందుబాటులోకి తీసుకొస్తున్నారు. ఈ క్రమంలో తిరుపతి మీదుగా నడుస్తున్న మరో పది ప్రత్యేక రైళ్లు అందుబాటులోకి తీసుకురానున్నారు.  

ప్రత్యేక రైళ్లు ఇవే 
హైదరాబాద్‌–తిరుపతి (ప్రతి శనివారం) నం.07510 రైలు ఈ నెల 27 నుంచి సెప్టెంబర్‌ 24వ తేదీ వరకు. 
తిరుపతి–హైదరాబాద్‌ (ప్రతి ఆదివారం)నం.07510 రైలు ఈనెల 28 నుంచి సెప్టెంబర్‌ 24 వరకు 
హైదరాబాద్‌–తిరుపతి (ప్రతి సోమవారం) నం.07643 రైలు సెప్టెంబర్‌ 5 నుంచి 26వ తేదీ వరకు 
తిరుపతి–హైదరాబాద్‌ (ప్రతి మంగళవారం)నం.07644 రైలు సెప్టెంబర్‌ 6 నుంచి 27 వరకు 
తిరుపతి–ఔరంగాబాద్‌ (ప్రతి ఆదివారం)నం.07637 రైలు ఈనెల 28 నుంచి సెప్టెంబర్‌ 25 వరకు 
ఔరంగాబాద్‌–తిరుపతి (ప్రతి సోమవారం)నం.07638 రైలు ఈనెల 29 నుంచి సెప్టెంబర్‌ 26 వరకు 
తిరుపతి–హుజూర్‌ సాహిబ్‌ నాందేడ్‌ (ప్రతి మంగళవారం)నం.07642 రైలు ఈనెల 30 నుంచి సెప్టెంబర్‌ 27 వరకు 
తిరుపతి–హుజూర్‌ సాహిబ్‌ నాందేడ్‌ (ప్రతి శనివారం)నం.07640 రైలు సెప్టెంబర్‌ 3 నుంచి అక్టోబర్‌ 1వ తేదీ వరకు 
హుజూర్‌ సాహిబ్‌ నాందేడ్‌–తిరుపతి(ప్రతి శుక్రవారం)నం.07639 రైలు సెప్టెంబర్‌ 2 నుంచి 30వ తేదీ వరకు 
తిరుపతి–కాచిగూడ (ప్రతి బుధవారం)నం.07614 రైలు సెప్టెంబర్‌ 7 నుంచి అక్టోబర్‌ 2 వరకు నడపనున్నట్టు సంబంధిత అధికారులు పేర్కొన్నారు.   

మరిన్ని వార్తలు