మావోయిస్టు నేత తల్లిని ఆప్యాయంగా పలకరించిన ఎస్పీ

13 Jul, 2022 11:41 IST|Sakshi
నీలమ్మతో మాట్లాడుతున్న ఎస్పీ రాధిక

శ్రీకాకుళం (వజ్రపుకొత్తూరు): బాతుపురం పంచాయతీ పెదవంక గ్రామానికి చెందిన మావోయిస్టు నేత చెల్లూరి నారాయణరావు(ప్రస్తుతం అండర్‌గ్రౌండ్‌లో ఉన్నారు) కుటుంబ సభ్యులను ఎస్పీ జి.ఆర్‌.రాధిక కలిశారు. వజ్రపుకొత్తూరు మండలంలో మంగళవారం పర్యటించిన ఆమె రాజాంలో ఉంటున్న నారాయణరావు తల్లి నీలమ్మను కలిసి అవ్వా.. నీ అరోగ్యం ఎలా ఉందంటూ ఆప్యాయంగా పలకరించారు.

కుటుంబ నేపథ్యం, ప్రస్తుత జీవన విధానం అడిగి తెలుసుకున్నారు. ఆరోగ్యం పట్ల శ్రద్ధ తీసుకోవాలని, అవసరమైన చికిత్స అందించడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉందన్నారు. కుటుంబ సభ్యులకు పోలీసులు ఉండగా ఉంటారని, ఎలాంటి  సమస్య వచ్చినా సంప్రదించాలని సూచించారు. అనంతరం కొంత నగదు, పండ్లు అందజేశారు. ఆమెతో పాటు కాశీబుగ్గ డీఎస్పీ శివరామిరెడ్డి, కాశీబుగ్గ సీఐ డి.రాము, ఎస్సై కూన గోవిందరావు తదితరులు ఉన్నారు.  

మరిన్ని వార్తలు