కలెక్టర్లు, ఎస్పీలతో సీఎం జగన్‌ సమీక్ష

1 Jun, 2022 19:26 IST|Sakshi

సాక్షి, తాడేపల్లి: ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి జిల్లా కలెక్టర్లు, ఎస్పీలతో బుధవారం స్పందన వీడియో కాన్ఫరెన్స్‌ నిర్వహించారు. స్పందన ఫిర్యాదులతో పాటు ఇళ్ళ పట్టాలు, ఇళ్ళ నిర్మాణం ప్రగతిపై సీఎం  సమీక్షించారు.

ఖరీఫ్ సన్నద్ధతపై, గ్రామ సచివాలయాలు, విలేజ్ క్లినిక్స్, అర్బీకేల నిర్మాణాలపై అధికారులను ఆయన దిశానిర్దేశం చేశారు. శాశ్వత భూ హక్కు-భూరక్షపై సమీక్ష కూడా నిర్వహించి.. స్పందన ఫిర్యాదుల పరిష్కారంపై అడిగి తెలుసుకోనున్నారు. వీటితో పాటు ఇరిగేషన్, జాతీయరహదారుల భూసేకరణపైనా సమీక్షించారు. పేదలందరికీ ఇళ్ల పథకం, ఉపాధిహామీ పనులు, విద్య, వైద్యరంగాల్లో నాడు–నేడు పనులపైన కూడా సీఎం ఉన్నతాధికారులతో చర్చించారు.

మరిన్ని వార్తలు