స్పందన కార్యక్రమం: పుట్టిన బిడ్డ తనది కాదంటున్నాడయ్యా !

17 Sep, 2021 08:49 IST|Sakshi
ప్రతిరోజు స్పందనలో బాధితుల సమస్యలు వింటున్న ఎస్పీ సిద్ధార్ధకౌశల్‌

కోనేరుసెంటర్‌: ప్రతిరోజు స్పందనలో వచ్చిన అర్జీలను చట్టపరిధిలో విచారణ జరిపించి పరిష్కరించేందుకు కృషి చేస్తున్నట్లు ఎస్పీ సిద్ధార్థ కౌశల్‌ తెలిపారు. గురువారం జిల్లా పోలీస్‌ కార్యాలయంలో జరిగిన ప్రతిరోజు స్పందన కార్యక్రమంలో పాల్గొన్న ఆయన బాధితుల నుంచి అర్జీలు స్వీకరించారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ ప్రజలకు ఎలాంటి సమస్య ఎదురైనా పోలీసులను ఆశ్రయించవచ్చనన్నారు. సమస్య తీవ్రతను బట్టి పరిష్కార చర్యలు తీసుకుంటామని చెప్పారు.

గుడివాడకు చెందిన ఓ మహిళ తన భర్త వేరే మహిళతో అక్రమ సంబంధం పెట్టుకుని అధిక కట్నం కోసం వేధిస్తున్నాడని ఫిర్యాదు చేసింది. తనకు కలిగిన బిడ్డ కూడా తనది కాదంటున్నాడని ఆవేదన వ్యక్తం చేసింది. భర్తపై చర్యలు తీసుకుని న్యాయం చేయాలంటూ విన్నవించింది. బాధితురాలి ఆవేదన ఆలకించిన ఎస్పీ గుడివాడ సీఐకు ఫిర్యాదును బదిలీ చేసి ఆమెకు తక్షణమే న్యాయం చేసేలా చర్యలు తీసుకోవాలని ఆదేశాలు జారీ చేశారు.

చదవండి: 
ఫింగర్‌ ప్రింట్స్‌ సమస్య.. తక్షణమే స్పందించిన గుంటూరు కలెక్టర్‌
మీరే మాకు కళ్లు, చెవులు.. మీరే మా బలం: సీఎం జగన్‌

మరిన్ని వార్తలు