మహాశివరాత్రికి ప్రత్యేక ఏర్పాట్లు 

1 Feb, 2023 05:32 IST|Sakshi

సాక్షి, అమరావతి: మహాశివరాత్రి నేప­థ్యంలో ప్రముఖ శైవ క్షేత్రాలన్నింటిలో దేవదాయ శాఖ ప్రత్యేక ఏర్పాట్లు చేసింది. శ్రీశైలం, శ్రీకాళహస్తి, కోటప్పకొండ, మహా­నంది ఆలయాలకు దేవదాయ శాఖ కమిషనర్‌ కార్యాలయంలో పనిచేస్తున్న నలుగురు అడిషనల్, రీజనల్‌ జాయింట్‌ కమిషనర్‌ స్థాయి అధికారులను ఒక్కొక్క ఆలయానికి ఒక్కొక్కరిని చీఫ్‌ ఫెస్టివల్‌ ఆఫీసర్లుగా నియమిస్తూ దేవదాయ శాఖ కమిషనర్‌ హరిజవహర్‌లాల్‌ మంగళవారం ఉత్తర్వులు జారీ చేశారు.

అడిషనల్‌ కమిషనర్‌ –1 చంద్రకుమార్‌ను కోటప్పకొండ ఆలయానికి, అడిషనల్‌ కమిషనర్‌ –2 రామచంద్రమోహన్‌ శ్రీకాళహస్తి ఆలయానికి, ఎస్టేట్స్‌ విభాగం జాయింట్‌ కమిషనర్‌ చంద్రశేఖర్‌ ఆజాద్‌ను శ్రీశైల ఆలయానికి, కర్నూలు డిప్యూటీ కమిషనర్‌గా పనిచేస్తున్న రాణా ప్రతాప్‌ను మహానంది ఆలయానికి చీఫ్‌ ఫెస్టివల్‌ ఆఫీసర్లుగా నియమిస్తున్నట్లు ఉత్తర్వులో పేర్కొన్నారు.

రాష్ట్రంలోని మిగిలిన శైవక్షేత్రాలకు సంబంధించి ఆర్‌జేసీలు ఆయా ఆలయాల వారీగా తమ పరిధిలోని సీనియర్‌ అధికారులను చీఫ్‌ ఫెస్టివల్‌ ఆఫీసర్లుగా నియమించాలని పేర్కొన్నారు. 

>
మరిన్ని వార్తలు