‘వైకుంఠ ఏకాదశి, న్యూ ఇయర్‌కు ప్రత్యేక ఏర్పాట్లు’

27 Dec, 2022 19:07 IST|Sakshi

తిరుమల:  శ్రీ తిరుమల కళ్యాణ వెంకటేశ్వరుని దర్శనంలో భాగంగా వైకుంఠ ఏకాదశి, నూతన సంవత్సరానికి ప్రత్యేక ఏర్పాట్లు చేసినట్లు టీటీడీ చైర్మన్‌ వైవీ సుబ్బారెడ్డి స్పష్టం చేశారు. ఏకాదశి నుంచి ఉత్తర ద్వార దర్శనం ఏర్పాటు చేశామన్నారు. జనవరి 2వ తేదీ నుండి 11వ తేదీ వరకూ వైకుంఠ ద్వార దర్శనం కోసం విస్తృత ఏర్పాట్లు చేసినట్లు తెలిపారు. జనవరి 1వ తేదీ నుంచి వైకుంఠ ద్వార దర్శన టికెట్లు జారీ చేస్తామన్నారు.

రోజుకు 50 వేల చొప్పున 5లక్షల టోకెన్లు కేటాయిస్తామన్నారు. దీనిలో భాగంగా డిసెంబర్‌ 31వ తేదీ, జనవరి 1వ తేదీన సర్వదర్శనం టోకెన్ల జారీ నిలిపివేయనున్నట్లు వైవీ సుబ్బారెడ్డి పేర్కొన్నారు. ఏకాదశి రోజు ఉదయం 6 గంటల నుంచి సర్వదర్శనం భక్తులకు అనుమతి ఉంటుందని, దర్శనానికి వచ్చే భక్తులు తప్పనిసరిగా మాస్క్‌లు ధరించాలని వైవీ సుబ్బారెడ్డి సూచించారు.

మరిన్ని వార్తలు :

మరిన్ని వార్తలు