పది పాస్‌కు ప్రత్యేక తరగతులు

11 Jun, 2022 16:21 IST|Sakshi

పశ్చిమ, ఏలూరు జిల్లాల్లో 17,980 మందికి క్లాస్‌లు

ఈనెల 13 నుంచి పరీక్షలు ముగిసేవరకు నిర్వహణ

ఉత్తీర్ణత శాతం పెంచేలా ప్రణాళికలు

పదో తరగతిలో ఫెయిలైన విద్యార్థులు విద్యా సంవత్సరం నష్టపోకుండా వారిని పరీక్షలకు మరింత సన్నద్ధం చేసేందుకు ప్రభుత్వం ప్రత్యేక కార్యచరణ రూపొందించింది. దీనిలో భాగంగా ఈనెల 13 నుంచి ఫెయిలైన విద్యార్థులకు ఆయా పాఠశాలలో ప్రత్యేక తరగతులు నిర్వహించనున్నారు.  

సాక్షి, భీమవరం: కోవిడ్‌ కారణంగా రెండేళ్లపాటు విద్యాబోధన సక్రమంగా సాగకపోవడంతో ఇటీవల ప్రకటించిన 10వ తరగతి పరీక్షల్లో ఆశించిన ఫలితాలు రాలేదు. గత రెండేళ్లు పదో తరగతి పబ్లిక్‌ పరీక్షలు లేకుండానే విద్యార్థులను పాస్‌ చేశారు. ప్రస్తుత విద్యాసంçవత్సరం తరగతులు నిర్వహించిన రోజులు తక్కువ కావడంతో ప్రభుత్వం పరీక్షా విధానంలో మార్పులు చేసింది. ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లాలో ఈసారి 57.55 శాతం మాత్రమే పాస్‌ అయ్యారు. పశ్చిమగోదావరి, ఏలూరు జిల్లాల్లో సుమారు 47వేల మంది పరీక్షలకు హాజరుకాగా వీరిలో దాదాపు 27 వేల మంది విద్యార్ధులు ఉత్తీర్ణత సాధించారు. 

ప్రభుత్వ పాఠశాలలో 31,254 మంది విద్యార్థులకు 13,274 మంది పాస్‌ అయ్యారు. పశ్చిమగోదావరి జిల్లాలో 9,303 మంది విద్యార్థులు తప్పగా వారిలో ఒక సబ్జెక్ట్‌ తప్పినవారు 3,226 మంది, రెండు సబ్జెక్టŠట్స్‌లో తప్పినవారు 2,272 మంది, మూడింటిలో తప్పినవారు 1,856 మంది, నాలుగింటిలో తప్పినవారు 1,079 మంది ఉన్నారు. 602 మంది అయిదు సబ్జెక్ట్స్‌ లో, 268 మంది అన్నింటిలో ఫెయిల్‌ అయ్యారు. 

ఈ నేపథ్యంలో వారిని సన్నద్ధం చేసి జూలైలో నిర్వహించే పరీక్షల్లో ఉత్తీర్ణత సా«ధించేలా తీర్చిదిద్దేందుకు ప్రత్యేక తరగతులు నిర్వహించనున్నారు. ఏ పాఠశాలలో ఎంతమంది ఫెయిల్‌ అయ్యారు.. ఏఏ సబ్జెక్సŠట్‌లో తప్పారు అన్న విషయాలను సేకరించి దానికి అనుగుణంగా ఆయా పాఠశాలల్లో ఈ నెల 13 నుంచి ప్రతి రోజు ఉదయం 9.30 నుంచి ప్రత్యేక తరగతుల నిర్వహణకు రూపకల్పన చేశారు. 

ఏ స్కూల్లో ఎన్ని తరగతులు నిర్వహించాలనే అంశాన్ని ఆయా పాఠశాలల ప్రాధానోపాధ్యాయులకే అప్పగించారు. విద్యార్థులకు సబ్జెక్సŠట్‌ వారిగా తరగతులు నిర్వహించి ఉత్తీరణ సాధించేలా సన్నద్ధం చేయడానికి రూపకల్పన చేశారు. కంపార్ట్‌మెంట్‌ పాస్‌గా కాకుండా రెగ్యులర్‌ పాస్‌గా ప్రకటిస్తామని ప్రభుత్వం చెప్పడంతో ఉత్తీర్ణత శాతంన్ని పెంచడానికి విద్యాశాఖాధికారులు ఉపాధ్యాయ సంఘాలతో మాట్లాడి ప్రత్యేక తరగతుల నిర్వహణకు ఏర్పాట్లు చేస్తున్నారు. అడ్వాన్స్‌డ్‌ పరీక్షల్లో ఉత్తీర్ణత శాతం పెరిగే అవకాశం ఉంటుందని ఉపాధ్యాయులు భావిస్తున్నారు. 

ప్రత్యేక కార్యాచరణతో తరగతుల నిర్వహణ 
పదో తరగతి అడ్వాన్స్‌డ్‌ పరీక్షలను ప్రత్యేకంగా సన్నద్ధం చేయడానికి కార్యాచరణ రూపొందించాం. ఎక్కువ మంది విద్యార్థులు ఒకటి, రెండు సబ్జ్‌క్ట్స్‌లో ఫెయిల్‌ అయినందున వారికి ప్రత్యేక తరగతులు నిర్వహించడం ద్వారా పరీక్షలకు సన్నద్ధం చేస్తాం. తరగతులు ఎలా నిర్వహించాలో ఆయా పాఠశాలల ప్రధానోపాధ్యాయులదే నిర్ణయం. ఫెయిలయిన విద్యార్థులకు సబ్జ్‌క్ట్‌ల బట్టి తరగతులు నిర్వహిస్తారు. పరీక్షలు ముగిసేవరకు ప్రత్యేక తరగతులు ఉంటాయి. 
– ఆర్‌వీ రమణ, జిల్లా విద్యాశాఖాధికారి, భీమవరం

మరిన్ని వార్తలు