ఖరీదు సాంబయ్య.. కర్రసామే శ్వాస, ధ్యాసగా జీవిస్తూ పతకాల పంట 

4 Dec, 2022 09:17 IST|Sakshi

సాక్షి, గుంటూరు(పెదకాకాని): మన భారతీయ సంస్కృతిలోని ప్రాచీన కళల్లో కర్రసాము ఒకటి. కర్రసామే శ్వాస, ధ్యాసగా జీవిస్తూ పతకాల పంట పండిస్తున్నాడు ఖరీదు సాంబయ్య(చంటి). జాతీయ అంతర్జాతీయ స్థాయిలో జరిగే కర్రసాము పోటీల్లో పాల్గొని అదరకొడుతున్నాడు. దేశవాళీ క్రీడ అయిన కర్రసాములో ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక స్థానం ఉండాలని ఆకాంక్షిస్తున్నాడు.  ప్రాచీన యుద్ధకళ అంతరించిపోకుండా రక్షించుకుంటూ పది మందికీ నేర్పించాలని తపన పడుతున్నాడు.  

గుంటూరు జిల్లా  ఫిరంగిపురం గ్రామానికి చెందిన ఖరీదు సాంబయ్య వ్యవసాయ కుటుంబానికి చెందిన వాడు. తండ్రి వెంకటేశ్వర్లు, తల్లి నాగేంద్రమ్మ. బీఎస్సీ కంప్యూటర్స్‌ చదువుకున్న సాంబయ్య పలు ప్రైవేటు కళాశాలల్లో జూనియర్‌ లెక్చరర్‌గా పనిచేశారు. కర్రసాముపై ఉన్న మమకారంతో ఉపాధ్యాయవృత్తికి స్వస్తి చెప్పి ఉదయం గోరంట్ల శివార్లలో చెట్ల కింద, సాయంత్రం వెనిగండ్ల పంచాయతీ కార్యాలయం వద్ద పిల్లలకు కర్రసాము శిక్షణ ఇస్తున్నారు. భార్య రాధిక, 11 ఏళ్ల గీతామాధురి, 10 ఏళ్ల కావ్యశ్రీ సంతానం.  ఏడాదిన్నర కాలంలోనే దేశ విదేశాలలో జరిగిన కర్రసాము పోటీల్లో పాల్గొని 32 గోల్డ్‌మెడల్స్, 4 సిల్వర్‌ మెడల్స్, 3 కాంస్య పతకాలు సాధించాడు.   

ఏడాదిన్నర కాలంలో సాధించిన కొన్ని విజయాలు.. 
►2021 మార్చి 21 నెల్లూరు జిల్లాలో 6వ స్టేట్‌లెవల్‌ కర్రసాము పోటీలలో బ్రాంజ్‌మెడల్,  
   సర్టిఫికెట్‌ 
►2021 ఆగస్టు 10 కర్నూలు జిల్లాలో జరిగిన కిక్‌ బాక్సింగ్‌లో భాగమైన మొదటి  ఆంధ్రప్రదేశ్‌ కర్రసాము పోటీలలో బ్రాంజ్‌మెడల్, సర్టిఫికెట్‌. నేషనల్‌ లెవల్‌లో జరిగే గోవా పోటీలకు అర్హత 
►2021 సెప్టెంబరు 5 నెల్లూరు జిల్లా సిలంబం స్టిక్‌ పెన్సింగ్‌ అసోసియేషన్‌ వారు –మేజర్‌ ధ్యాన్‌చంద్‌ సర్టిఫికెట్, యూనివర్సిల్‌ ఎచీవర్స్‌ బుక్‌ ఆఫ్‌ రికార్డు సర్టిఫికెట్, ట్రోఫీ  
►2021 సెప్టెంబరు 26 మద్రాస్‌ సిలంబం ఆఫ్‌ ఇండియా అసోసియేషన్‌ వారు వరల్డ్‌ రిఫరీగా సెలక్ట్‌ చేసి సర్టిఫికెట్, షీల్డ్‌తో సన్మానం 
►2021 నవంబరు 14 కృష్టా జిల్లాలో జరిగిన మొదటి స్టేట్‌ ట్రెడిషనల్‌ లాఠీ స్పోర్ట్స్‌ అసోసియేషన్‌ ఆంధ్రప్రదేశ్‌ వారు నిర్వహించిన కర్రసాము పోటీల్లో గోల్డ్‌మెడల్‌. మధ్యప్రదేశ్‌లోని గ్వాలియర్‌లో జరిగే నేషనల్‌ ట్రెడిషనల్‌ లాఠీ స్పోర్ట్స్‌ పోటీలకు అర్హత 
►2021 డిసెంబరు 25 మధ్యప్రదేశ్‌లోని గ్వాలియర్‌లో జరిగిన 2వ నేషనల్‌ ట్రేడిషనల్‌ లాఠీ స్పోర్ట్స్‌ చాంపియన్‌íÙప్‌ 2021 పోటీలలో గోల్డ్‌మెడల్‌ మెడల్‌. 
►2022 ఫిబ్రవరి 13  ఎక్స్‌లెంట్‌ వరల్డ్‌ రికార్డ్స్‌ వారు ఉత్తరాఖాండలోని హరిద్వార్‌లో ద్రోణాచార్యుడి అవార్డు 
►2022 మార్చి 27 వైఎంకే 2022 మార్షల్‌ ఆర్ట్స్‌ అకాడమీ విజయవాడ వారి ఆధ్వర్యంలో ఫస్ట్‌ నేషనల్‌  ఓపెన్‌ కుంగ్‌పూ కరాటే చాంపియన్‌        íÙప్, కర్రసాము పోటీలలో గోల్డ్‌మెడల్‌  


► 2022 మే 8 కాకినాడలో జరిగిన రెండవ రాష్ట్రస్థాయి కర్రసాము పోటీలలో  కర్ర, రెండు కర్రలు, ఫైటింగ్‌ విభాగాలలో మూడు గోల్డ్‌మెడల్స్‌  
►2022 మే 14 రాజస్థాన్‌ జైపూర్‌లో జరిగిన ఆల్‌ ఇండియా కర్రసాము చాంపియన్‌షిప్‌ 2022 నేషనల్‌ లెవల్‌ పోటీలలో ఒక కర్ర, రెండు కర్రలు, ఫైటింగ్‌ విభాగాలలో మూడు గోల్డ్‌మెడల్స్‌. నేపాల్‌లోని ఖాఠ్మాండ్‌లో జరిగే ఇంటర్‌నేషనల్‌ పోటీలకు ఎంపిక 
►2022 మే 28న ఖాఠ్మాండ్‌లో జరిగిన ఇండో–నేపాల్‌ ఇంటర్‌ నేషనల్‌ గేమ్స్‌ వారు నిర్వహించిన కర్రసాము పోటీలలో ఒక కర్ర, రెండు కర్రలు, ఫైటింగ్‌ విభాగాలలో మూడు గోల్డ్‌మెడల్స్‌.  
►2022 జూన్‌ 26 రాజమండ్రిలో నిర్వహించిన ఫస్ట్‌ ఇంటర్‌ స్టేట్‌ కరాటే చాంపియన్‌ షిప్‌ వారు నిర్వహించిన కర్రసాము ఆన్‌లైన్‌ పోటీలలో  ఒక కర్ర, రెండు కర్రలు, ఫైటింగ్‌ విభాగాలలో మూడు గోల్డ్‌మెడల్స్‌. 
►2022 జులై 27 నేపాల్‌ రాజధాని ఖాఠ్మాండ్‌లో అంతర్జాతీయ స్థాయిలో జరిగిన సౌత్‌ ఏషియన్‌ లాఠీ చాంపియన్‌ షిప్‌ కర్రసాము పోటీలలో ఒక కర్ర, రెండు కర్రలు, ఫైటింగ్‌ విభాగాలలో ఒక గోల్డ్, రెండు సిల్వర్‌ మెడల్స్‌  
►2022 సెప్టెంబర్‌ 2 ఉత్తరప్రదేశ్‌ నోయిడాలో జరిగిన నేషనల్‌ లెవల్‌ కర్రసాము పోటీలలో ఒక గోల్డ్, ఒక బ్రాంజ్‌ మెడల్‌. 
►2022 నవంబరు 13 తెలంగాణ యూసఫ్‌గూడలో జరిగిన ఇంటర్నేషనల్‌ మార్షల్‌ ఆర్ట్స్‌ చాంపియన్‌షిప్‌ 2022 పోటీలకు 14 మంది శిష్యులతో పాల్గొనగా ఒక కర్ర, రెండు కర్రలు, సురులు, చైన్‌పంత్, జింక కొమ్ములు, ఫైటింగ్‌ విభాగాలలో 32 మెడల్స్‌ వచ్చాయి. వాటిలో గోల్డ్‌మెడల్స్‌ 18, సిల్వర్‌ మెడల్స్‌ 9, బ్రాంజ్‌ మెడల్స్‌ 5 రావడం తనకు ఓవరాల్‌ చాంపియన్‌షిప్‌ కప్‌ అందజేసి సన్మానించడం మరపురాని గొప్ప అనుభూతిగా ఆయన ఆనందాన్ని తెలియజేశారు. 

చదవండి: (సీఎం జగన్‌ ప్రమాణ స్వీకారం వీడియో చూస్తూ ఆపరేషన్‌)

దాతల సహకారం, ప్రభుత్వ ప్రోత్సాహం కావాలి... 
కర్రసాములో ఇప్పటివరకు నేను సాధించిన విజయాల్లో దాతల సహాయ సహకారాలు ఎన్నటికీ మరవలేను. ప్రస్తుతం గోరంట్లలో చెట్ల కింద, వెనిగండ్లలో  తిరుమలరెడ్డి స్థలంలో కర్రసాము శిక్షణ ఇస్తున్నాను. మొదట్లో పిల్లలకు ఉచితంగానే నేరి్పంచా. అద్దె ఇల్లు కుటుంబ పోషణ భారంగా మారింది.  దాతల సహకారంతో పాటు ప్రభుత్వ ప్రోత్సాహం ఉంటే బ్యాచ్‌ల వారీగా బాల బాలికలకు, యువతీ యువకులకు ఉచితంగా కర్రసాము మెలకువలు నేరి్పంచి తీర్చిదిద్దుతా. కర్రసాములో మన రాష్ట్రానికి ప్రత్యేక స్థానం ఉండేలా కృషి చేస్తా. ఇటీవల జిల్లా కలెక్టర్‌ ఎం.వేణుగోపాలరెడ్డిని కలవగా శాప్‌ ద్వారా ఉద్యోగం ఇప్పిస్తామని చెప్పారు. 
– ఖరీదు సాంబయ్య(చంటి), కర్రసాము శిక్షకుడు, గుంటూరు 

పతకాల పంట
కర్రసాముగా పిలుచుకునే ఈ క్రీడను తమిళనాడులో సిలంబం, కేరళలో కలరిపట్టు, మధ్యప్రదేశ్‌లో ట్రెడిషనల్‌ లాఠీ వంటి పేర్లతో పిలుస్తున్నారు. కర్రసాముపై ఉన్న ఆసక్తితో తాను నేర్చుకొని పతకాలు సాధించడంతో పాటు మరికొందరికి కర్రసాములో శిక్షణ ఇస్తూ పతకాలు పంట పండిస్తున్నాడు. సాంబయ్య మాస్టార్‌ 2022 నవంబరు 13న తెలంగాణలోని యూసఫ్‌గూడలో జరిగిన కర్రసాము పోటీలకు 14 మంది శిష్యులతో వెళ్లాడు. ఒక కర్ర, రెండు కర్రలు, సురులు, చైన్‌పంత్, జింక కొమ్ములు, ఫైటింగ్‌ విభాగాలలో మొత్తం 32 మెడల్స్‌ సాధించారు. వాటిలో 18 గోల్డ్‌మెడల్స్, 9 సిల్వర్‌ మెడల్స్, 5 కాంస్యాలు గెలుపొందారు. ఓవరాల్‌ చాంపియన్‌ షిప్‌ కప్పు అందుకోవడంతో పాటు రిఫరీగా, న్యాయ నిర్ణేతగా సర్టిఫికెట్లు అందుకున్నారు.   

మరిన్ని వార్తలు