Summer Special Tour: తిరుపతి, అరకుకు స్పెషల్‌ టూర్స్‌

3 May, 2022 11:36 IST|Sakshi

తాటిచెట్లపాలెం(విశాఖ ఉత్తర): వేసవి సీజన్‌లో పర్యాటకులు, యాత్రికుల కోసం ఇండియన్‌ రైల్వే కేటరింగ్‌ అండ్‌ టూరిజం కార్పొరేషన్‌( ఐఆర్‌సీటీసీ) పలు ప్రత్యేక టూర్స్‌ను పరిచయం చేస్తున్నట్లు ఐఆర్‌సీటీసీ ఏరియా మేనేజర్‌ చంద్రమోహన్‌ ఒక ప్రకటనలో తెలిపారు. 

విశాఖపట్నం–అరకు–విశాఖపట్నం (రైల్‌ కం రోడ్‌ ప్యాకేజీ):  
ఈ టూర్‌ ప్రతీ రోజు విశాఖపట్నంలో ఉదయం ప్రారంభమై, రాత్రికి విశాఖపట్నంలోనే ముగుస్తుంది. ఈ టూర్‌లో అరకు వ్యాలీ(ట్రైబల్‌ మ్యూజియం, టీ తోటలు, థింసా నృత్యం) అనంతగిరి కాఫీ తోటలు, గాలికొండ వ్యూ పాయింట్, బొర్రాగుహలు సందర్శించవచ్చు. విశాఖపట్నం నుంచి అరకుకు ఉదయం రైలులో బయల్దేరుతారు. అక్కడ నుంచి అన్ని ప్రాంతాలను చూపించి తిరిగి అరకు నుంచి రోడ్‌ మార్గం ద్వారా అదేరోజు రాత్రి విశాఖపట్నం చేరుస్తారు.

ఈ టూర్‌ ప్యాకేజీ చార్జీలు విశాఖ నుంచి అరకు వరకు విస్టాడోమ్‌ కోచ్‌లో వెళ్లాలనుకుంటే పెద్దలకు రూ.3,060, పిల్లలకు రూ.2670, స్లీపర్‌ క్లాస్‌ కోచ్‌ అయితే పెద్దలకు రూ.2,385, పిల్లలకు రూ.2,015, సెకండ్‌ సిటింగ్‌ పెద్దలకు రూ.2,185, పిల్లలకు రూ.1,815(ఈ చార్జీలు సైట్‌సీయింగ్, రానుపోను ప్రయాణఖర్చులు, అల్పాహారం, మ«ధ్యాహ్నం భోజనం, సాయంత్రం హై టీ, బోర్రా ప్రవేశచార్జీలు, అన్ని పన్నులు కలుపుకుని) 

తిరుమల దర్శన్‌ యాత్ర (3 రాత్రులు, 4పగళ్లు) 
ఈ టూర్‌ ప్రతీ శుక్రవారం విశాఖపట్నంలో ప్రారంభమవుతుంది. ఈ టూర్‌లో కాణిపాకం, శ్రీపురం, తిరుమల వేంకటేశ్వరస్వామి దర్శనం, శ్రీకాళహస్తి, తిరుచానూర్‌ ప్రాంతాలను సందర్శించవచ్చు. థర్డ్‌ ఏసీ సింగిల్‌ ఆక్యుపెన్సీ రూ.17,860, డబుల్‌ ఆక్యుపెన్సీ రూ. 11,720, త్రిబుల్‌ ఆక్యుపెన్సీ రూ.10,495, స్లీపర్‌ క్లాస్‌ సింగిల్‌ ఆక్యుపెన్సీ రూ.15,765, డబుల్‌ ఆక్యుపెన్సీ రూ.9,625, త్రిబుల్‌ ఆక్యుపెన్సీ రూ.9,400.. వసతి, రవాణా, తిరుమలలో స్పెషల్‌ ఎంట్రీ దర్శనం చార్జీలు, కాణిపాకం, తిరుచానూర్‌ టికెట్‌ చార్జీలు, టోల్‌ గేట్స్, పార్కింగ్, జీఎస్టీ వంటి అన్ని చార్జీలతో కలిపి ఉంటాయని తెలిపారు. మరిన్ని వివరాలకు విశాఖపట్నం రైల్వేస్టేషన్‌లో ఒకటో నెంబర్‌ ప్రవేశద్వారం వద్ద గల ఐఆర్‌సీటీసీ కార్యాలయంలో స్వయంగా గానీ లేదా 0891–2500695, 8287932318 నెంబర్లలో గానీ సంప్రదించాలని కోరారు. 

(చదవండి: మంత్రులు, ఎమ్మెల్యేలే టార్గెట్‌)

మరిన్ని వార్తలు