మహిళా సిబ్బందితో ప్రత్యేక రైలు 

8 Mar, 2023 04:01 IST|Sakshi

అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా విశాఖ నుంచి రాయగడకు 

తాటిచెట్లపాలెం (విశాఖ ఉత్తర): అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా మహిళా సిబ్బందితో విశాఖపట్నం నుంచి రాయగడకు ప్రత్యేక రైలు బయల్దేరింది. ఈస్ట్‌కోస్ట్‌ రైల్వే ఉమెన్స్‌ వెల్ఫేర్‌ ఆర్గనైజేషన్‌ (ఈకార్వో) ప్రెసిడెంట్‌ పారిజాత సత్పతి.. వైస్‌ ప్రెసిడెంట్స్‌ కవితా గుప్తా, ప్రియాంక శ్రీదేవి, ఎగ్జిక్యూటివ్‌ సభ్యులతో కలిసి ఈ రైలును మంగళవారం విశాఖపట్నం రైల్వేస్టేషన్‌లో జెండా ఊపి ప్రారంభించారు.

ఈ ప్రత్యేక రైలుకు సహనాకుమారి లోకోపైలట్‌గా, కె.నాగమణి అసిస్టెంట్‌ లోకోపైలట్‌గా, ఎం.కళ్యాణి ట్రైన్‌ మేనేజర్‌గా, ఎస్‌.అంబిలి, జి.అచ్యుతాంబ, కె.సంతోíÙరావు, డి.రాధ టికెట్‌ తనిఖీ సిబ్బందిగా విధుల్లో ఉన్నారు. ఈ సందర్భంగా ఈకార్వో ప్రెసిడెంట్‌ పారిజాత సత్పతి మాట్లాడుతూ విశాఖ నుంచి మహిళా సిబ్బందిచే ప్రత్యేక రైలును నడిపించడం సంతోషంగా, గర్వంగా ఉందన్నారు.

ఈ రోజు విశాఖపట్నం రైల్వేస్టేషన్‌లో ఆపరేషన్స్, కమర్షియల్, ఆరీ్పఎఫ్‌.. ఇలా అన్ని విభాగాల్లోను మహిళలే విధులు నిర్వర్తించారని తెలిపారు. వాల్తేర్‌ డివిజన్‌ మహిళా సాధికారత విషయంలో ముందుంటుందని, అనేకమంది మహిళలను ట్రాక్‌ మెయింటెనెన్స్‌లో, ట్రైన్‌ ఆపరేషన్స్‌లో, ఆర్‌ఆర్‌ఐలో, ట్రైన్‌ మేనేజర్స్‌గా, టికెట్‌ తనిఖీ సిబ్బందిగా, కార్యాలయాల్లోను విధులు నిర్వర్తిస్తున్నారని గుర్తుచేశారు. వాల్తేర్‌ డివిజన్‌ ప్రత్యేకంగా మహిళల చేత కొన్ని విభాగాలనే నడుపుతున్నట్లు తెలిపారు. మహిళా దినోత్సవం సం­­దర్భంగా ఈకార్వో ఆధ్వర్యంలో ప్రత్యేకంగా ఆర్కే బీచ్‌లో వాక­థాన్‌ నిర్వహించినట్లు చెప్పారు.

మరిన్ని వార్తలు