విజయవాడ మీదుగా ప్రత్యేక రైళ్లు

3 Dec, 2020 08:22 IST|Sakshi
ప్రతీకాత్మక చిత్రం

రైల్వేస్టేషన్‌(విజయవాడ పశ్చిమ): ప్రయాణికుల రద్దీ దృష్ట్యా విజయవాడ మీదుగా పలు ప్రత్యేక రైళ్లు నడపనున్నట్లు రైల్వే అధికారులు బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ జాబితాలో మచిలీపట్నం–యశ్వంతపూర్‌ ప్రత్యేక రైలు(07211) ఈ నెల 9 నుంచి ప్రతి సోమ, బుధ, శుక్ర వారాలలో మధ్యాహ్నం 3.50 గంటలకు మచిలీపట్నంలో బయలుదేరుతుంది. తిరుగు ప్రయాణంలో ఈ రైలు(07212) మధ్యాహ్నం 2.20 గంటలకు బయలుదేరి, మరుసటి రోజు ఉదయం 7.05 గంటలకు మచిలీపట్నం చేరుకుంటుంది.

కాకినాడ–బావానగర్‌ టెర్మినస్‌ ప్రత్యేక రైలు(07204) ఈ నెల 10 నుంచి ప్రతి గురువారం ఉదయం 5.15 గంటలకు కాకినాడలో బయలుదేరి, మరుసటి రోజు సాయంత్రం 6.55 గంటలకు గమ్యస్థానానికి చేరుకుంటుంది. తిరుగు ప్రయాణంలో (07203)ఈ నెల 12 నుంచి ప్రతి శనివారం ఉదయం 4.25 గంటలకు బావానగర్‌ టెర్మినస్‌లో బయలుదేరుతుంది.

కాకినాడ పోర్టు–లోకమాన్యతిలక్‌ ప్రత్యేక రైలు(07221) ఈ నెల 9 నుంచి ప్రతి బుధ, శనివారాలలో ఉదయం 9 గంటలకు కాకినాడ పోర్టులో బయలుదేరి, మరుసటి రోజు ఉదయం 11గంటలకు లోకమాన్యతిలక్‌ చేరుకుంటుంది. తిరుగు ప్రయాణంలో (07222) ఈ నెల 10 నుంచి ప్రతి గురు, ఆదివారాలలో మధ్యాహ్నం 1.20 గంటలకు లోకమాన్యతిలక్‌లో బయలుదేరుతుంది. 

చదవండి: ఏపీ పోలీస్‌కి అవార్డుల పంట

మరిన్ని వార్తలు