శ్రీ చైతన్య కాలేజీలో షాకింగ్‌ ఘటన.. విద్యార్థిని తన్నుతూ చితకబాదిన లెక్చరర్‌

17 Sep, 2022 07:31 IST|Sakshi

లబ్బీపేట (విజయవాడ తూర్పు): తరగతి గదిలో మాట్లాడాడని ఓ విద్యారి్థని అధ్యాపకుడు చెంపలు వాయించడంతో పాటు, కాలితో తన్నిన ఘటన శుక్రవారం కలకలం రేపింది. విజయవాడ బెంజిసర్కిల్‌ సమీపంలోని శ్రీ చైతన్య కళాశాల భాస్కర్‌ భవన్‌ క్యాంపస్‌లో గురువారం జరిగిన ఈ ఘటనకు సంబంధించిన వీడియో శుక్రవారం సోషల్‌ మీడియాలో వైరల్‌ అయింది.

దీంతో రాష్ట్ర విద్యాశాఖ ఉన్నతాధికారులు స్పందించడంతో జిల్లా విద్యాశాఖ అధికారులతో పాటు, చైల్డ్‌లైన్‌ వారు కూడా రంగంలోకి దిగారు. ఇంటర్‌ బోర్డు ప్రాంతీయ తనిఖీ అధికారి రవికుమార్, జిల్లా విద్యాశాఖాధికారి రేణుక కళాశాలకు వెళ్లి విచారించారు. విద్యార్థి ఇయర్‌ఫోన్స్‌లో పాటలు వింటుంటే ఎన్నిసార్లు చెప్పినా వినకపోవడంతో క్షణికావేశంలో అలా చేసినట్లు అధ్యాపకుడు చెబుతుండగా.. తమ అబ్బాయి వద్ద ఫోన్‌లేదని విద్యార్థి తల్లిదండ్రులు చెబుతున్నారు. అధ్యాపకుడ్ని కళాశాల యాజమాన్యం శుక్రవారం తొలగించినట్లు ఆర్‌ఐవో తెలిపారు.

మరిన్ని వార్తలు