‘ఏపీలో మరో 17వేల జగనన్న కాలనీలు రాబోతున్నాయి’

15 Jun, 2021 13:29 IST|Sakshi
( ఫైల్‌ ఫోటో )

సాక్షి, విజయనగరం: ఆంధ్రప్రదేశ్‌లో మరో 17 వేల జగనన్న కాలనీలు రాబోతున్నాయని మంత్రి శ్రీ రంగనాథ రాజు తెలిపారు. పేదలందరికీ ఇళ్లు, జగనన్న కాలనీలపై మంత్రి రంగనాథరాజు మంగళవారం సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. తొలి విడతలో విజయనగరం జిల్లాలో 98వేల ఇళ్ల నిర్మాణం చేపట్టనున్నట్లు తెలిపారు. కరోనా సమయంలో కూడా సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నామని పేర్కొన్నారు. గ్రామాల్లోని ప్రతి కుటుంబంలో ఆర్ధికవృద్ధి పెరుగుతుందని, పార్టీలకతీతంగా అర్హత ఉన్న ప్రతి ఒక్కరికీ ఇల్లు మంజూరు అవుతాయని భరోసానిచ్చారు.

చదవండి: 
ధవళేశ్వరం నుంచి గోదావరి డెల్టాకు సాగునీరు

భూకబ్జాలో కొత్త కోణం: దళితుల భూమి వదల్లేదు

మరిన్ని వార్తలు