ఇళ్ల లేఅవుట్ల వద్దే సామాగ్రి సరఫరా: మంత్రి శ్రీరంగనాథరాజు

24 Aug, 2021 11:06 IST|Sakshi
గృహనిర్మాణ శాఖ మంత్రి చెరుకువాడ శ్రీరంగనాథరాజు ( ఫైల్‌ ఫోటో )

విజయవాడ: తక్కువ ధరకే పేదలకు ఇళ్ల నిర్మాణ సామాగ్రిని అందిస్తున్నామని రాష్ట్ర గృహనిర్మాణ శాఖ మంత్రి చెరుకువాడ శ్రీరంగనాథరాజు అన్నారు. మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ..  ప్రతి లబ్ధిదారునికి 40 శాతం తక్కువ ధరకే సామాగ్రిని అందిస్తున్నట్లు, ఇళ్ల లే ఔట్ల దగ్గరకే మెటీరియల్ సరఫరా చేస్తున్నామని పేర్కొన్నారు. ఈ ప్రక్రియలో రివర్స్ టెండరింగ్ ద్వారా రూ.వేల కోట్లు ఆదా చేయడంతో పాటు అదనంగా ఇంటి నిర్మాణానికి పేదలకు పావలా వడ్డీకి రుణం ఇప్పిస్తున్నామన్నారు.  చదవండి: ఓరి భగవంతుడా .. కష్టాలు గట్టెక్కాయని అనుకునేలోపే..

లబ్ధిదారులకు ఆప్షన్ లు బలవంతంగా మారుస్తున్నారన్నది తప్పుడు ప్రచారమని, వారికి ఎలా కావాలంటే అలా ఇళ్లను నిర్మిస్తున్నామని వెల్లడించారు. అక్టోబర్ 25 నుంచి మూడో కేటగిరి ఇళ్ల నిర్మాణం చేపడతున్నట్లు తెలిపారు.
  
 

మరిన్ని వార్తలు