అనంతపురం ఎద్దులు ఫస్ట్‌  

3 Jun, 2022 22:59 IST|Sakshi
బండను లాగుతున్న ఎద్దులు  

వల్లూరు: కడప– తాడిపత్రి ప్రధాన రహదారి పక్కన వల్లూరు మండలంలోని పాపాఘ్ని నగర్‌ వద్ద వెలసిన శ్రీ వీరాంజనేయ స్వామి తిరునాల మహోత్సవంలో భాగంగా గురువారం నిర్వహించిన బండలాగుడు పోటీలలో అనంతపురం జిల్లా పెద్దపప్పూరు మండలం చాగల్లుకు చెందిన వై ఆదినారాయణ ఎద్దులు 3986 అడుగులు బండను లాగి మొదటి స్థానంలో నిలిచాయి. మొత్తం 23 జతల కాండ్లు ఈ పోటీల్లో పాల్గొన్నాయి. కమిటీ సభ్యులు చిన్న ఓబులేసు  పోటీలను ప్రారంభించారు.  

వల్లూరు మండలం చిన్న నాగిరెడ్డి పల్లెకు చెందిన నారంగారి శంకర్‌రెడ్డి ఎద్దులు 3863 అడుగులు బండను లాగి ద్వితీయ స్థానంలో, నంద్యాల జిల్లా రుద్రవరం మండలం అప్పనపల్లెకు చెందిన గురు చరణ్‌ ఎద్దు మరియు దువ్వూరు మండలం దాసరిపల్లెకు చెందిన నరేష్‌ ఎద్దు కలిసి 3609 అడుగులు బండను లాగి మూడవ స్థానంలో నిలిచాయి. 

రాజుపాలెం మండలం కూలూరుకు చెందిన మారం రమేష్‌ ఎద్దులు 3500 అడుగులు లాగి నాలుగో స్థానంలో, ప్రకాశం జిల్లా బెస్తవారిపేట మండలం వంగపాడుకు చెందిన కైపా వెంకట రమణారెడ్డి ఎద్దులు 3423 అడుగులు లాగి ఐదవ స్థానంలో, కర్నూలు జిల్లా ప్యాపిలి మండలం గుడిపాడుకు చెందిన వెంకట రామిరెడ్డి ఎద్దులు 3263 అడుగులు లాగి ఆరవ స్థానంలో, ఖాజీపేట మండలం ముత్తలూరు పాడుకు చెందిన ధవనం ఓబన్న ఎద్దులు 3151 అడుగులు లాగి ఏడవ స్థానంలో నిలిచాయి. 

మొదటి బహుమతి రూ. 20 వేలను ఏపీఎస్‌ఆర్‌టీసీ రాష్ట్ర ఛైర్మన్‌ దుగ్గాయపల్లె మల్లికార్జునరెడ్డి, రెండవ బహుమతి రూ. 15, 116  నారంగారి శంకర్‌రెడ్డి, మూడవ బహుమతి రూ. 10,016  నాగుల గార్ల రమణ, నాలుగవ బహుమతి రూ. 5, 016  పుత్తా మసాన్, ఐదవ బహుమతి రూ. 3, 016 వై బయన్న, ఆరవ బహుమతి రూ. 2,016 ఆది వేమయ్యలు వితరణగా అందచేశారు. 

మరిన్ని వార్తలు