పని చేయమంటే కథలు బాగా చెబుతున్నారు!

14 Nov, 2020 10:17 IST|Sakshi
మంచినీళ్లపేట సచివాలయ ఉద్యోగులపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్న జిల్లా కలెక్టర్‌ నివాస్‌   

సాక్షి, వజ్రపుకొత్తూరు రూరల్‌: పని చేయమంటే కథలు బాగా చెబుతున్నారు. నా దగ్గర అలాంటివి చెప్పడం మానేసి బయట కథలు రాసుకోండి అంటూ గ్రామ సచివాలయ ఉద్యోగులపై జిల్లా కలెక్టర్‌ జె.నివాస్‌ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. వజ్రపుకొత్తూరు మండలం మంచినీళ్లపేట, నువ్వలరేవు గ్రామాల్లో శుక్రవారం కలెక్టర్‌ పర్యటించారు. ఈ సందర్భంగా మంచినీళ్లపేట ప్రాథమిక పాఠశాలలో జరుగుతున్న నాడు–నేడు పనులను పరిశీలించారు. అనంతరం గ్రామ సచివాలయాన్ని కూడా సందర్శించారు. అయితే సచివాలయం ఎదురుగా చెత్త పేరుకుపోయి ఉండటాన్ని చూసిన ఆయన కార్యదర్శులపై మండిపడ్డారు. శనివారంలోగా చెత్తను తొలగించి సంబంధిత ఫొటోలను తనకు పెట్టాలని అదేశించారు. ]

ప్రభుత్వ పథకాల లబి్ధదారుల జాబితాను సచివాలయం వద్ద ఎందుకు ప్రదర్శించలేదని ప్రశ్నించారు. హెంగర్లు, బోర్డులు, లబి్ధదారుల జాబితా లిస్టులు అస్తవ్యస్తంగా ఉండటంతో అసంతృప్తి వ్యక్తం చేశారు. చిన్న పనులు కుడా చేయకపోతే మీరు ఎందుకు అంటూ మండిపడ్డారు. ఇలాగైతే రేపటి నుంచి ఆఫీసుకు రానవసరం లేదన్నారు. గ్రామ సచివాలయ ఉద్యోగులతో పాటు ఎంపీడీవో ఈశ్వరమ్మ పనితీరుపై అసంతృప్తి వ్యక్తం చేశారు. íఫీవర్‌ సర్వే వివరాలను గ్రామ వలంటీర్లను అడిగి తెలుసుకున్నారు. ప్రతి ఒక్కరూ క్రమశిక్షణతో పని చేయాలని సూచించారు. జనరల్‌ ఫండ్‌ను సది్వనియోగం చేసుకొని గ్రామంలో వీధి దీపాలు ఏర్పాటు చేయాలన్నారు. నువ్వలరేవు గ్రామ సచివాలయన్ని కూడా కలెక్టర్‌  పరిశీలించి సంతృప్తి వ్యక్తం చేశారు. సబ్‌ కలెక్టర్‌ సూరజ్‌ ధనుంజయ, తహసీల్దార్‌ బి.అప్పలస్వామి, ఎంపీడీవో ఈశ్వరమ్మ, రెవెన్యూ అధికారులున్నారు. 

మరిన్ని వార్తలు