గల్లంతైన 12 మంది మత్స్యకారులు సురక్షితం..

19 Jul, 2021 21:33 IST|Sakshi

శ్రీకాకుళం: సముద్రంలో వేటకు వెళ్లి గల్లంతైన 12 మంది మత్స్యకారులు సురక్షితంగా ఉన్నట్లు ఆధికారులు ధృవీకరించారు. చెన్నై తీరప్రాంతంలో బోటును గుర్తించామని చెన్నై కోస్టుగార్డ్‌ తెలిపింది. దీంతో కుటుంబ సభ్యులు ఊపిరి పీల్చుకున్నారు.   ఈ నెల 7న చెన్నైలోని కాశిమీడు ఫిషింగ్‌ హార్బర్‌ నుంచి బోటులో మత్స్యకారులు వేటకు వెళ్లారు. ఈ నెల 16 నుంచి వీరంతా ఎవరికీ అందుబాటులో లేకపోవడంతో  కుటుంబ సభ్యులు ఆందోళన చెందారు.

గల్లంతైన మత్స్యకారులంతా శ్రీకాకుళం జిల్లా ఇచ్ఛాపురానికి చెందినవారు. ఈ విషయాన్ని బాధిత కుటుంబసభ్యులు పశుసంవర్థక, మత్స్యశాఖ మంత్రి సీదిరి అప్పలరాజు దృష్టికి తీసుకెళ్లారు. దీంతో ఏపీ, తమిళనాడు ప్రభుత్వాలు రంగంలోకి దిగాయి. ఏపీ నుంచి నేవీ హెలికాప్టర్‌, తమిళనాడు నుంచి డోర్నియర్‌ విమానాల్లో గాలింపు చర్యలు చేపట్టారు. సహాయక చర్యలను  సీదిరి అప్పలరాజు పర్యవేక్షించారు. ఉపాధి కోసం వారంతా చెన్నైకి వెళ్లినట్టుగా కుటుంబసభ్యులు తెలిపారు. శ్రీకాకుళం జిల్లాకు చెందిన మత్స్యకారులు దేశంలోని పలు ప్రాంతాల్లో ఉపాధి కోసం వెళ్తుంటారు. 

సురక్షితంగా బయట పడ్డ మత్స్యకారులు వీరే

1. కోడ సోమేష్  బోట్ డ్రైవర్
2. కోడ జగన్నాధం
3. మోస సూర్యనారాయణ
4. అంబటి నీలకంఠం
5. నిట్ట జోగారావు 
6. కామేష్
7. రాజు
8. శివాజి
9. బావయ్య
10. రవి
11. అప్పారావు
12. బాబు

Read latest Andhra-pradesh News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు