టీచర్‌పై మమకారం.. బగ్గీపై ఊరేగింపు..

1 Apr, 2021 14:28 IST|Sakshi

సాక్షి, శ్రీకాకుళం : ఇంటి ఆడ పడుచు వేరే ఇంటికి వెళ్లిపోతున్న బాధ ఆ గ్రామస్తుల కళ్లలో కనిపించింది. అమ్మ ఊరెల్లిపోతుంటే అడ్డుకునే బిడ్డల అమాయకత్వం ఆ పిల్లల ముఖాల్లో అగుపించింది. నాలుగేళ్ల పాటు పాఠాలు చెప్పి, బడిని బాగు చేసి బదిలీపై వెళ్లిపోతున్న టీచర్‌ను విద్యార్థులు వదల్లేకపోయారు. వీడ్కోలు కూడా మర్చిపోలేని విధంగా ఉండాలని భావించారు. టీచర్‌ పనితీరు తెలిసిన గ్రామస్తులు కూడా పిల్లలకు జత కలవడంతో గొనకపాడులో అపురూప దృశ్యం ఆవిష్కృతమైంది. ఇక్కడి జెడ్పీ హైసూ్కల్‌లో నాలుగేళ్లు హెచ్‌ఎంగా పనిచేసి బదిలీపై వెళ్లిన అల్లాడ లలితకుమారిని విద్యార్థులు, గ్రామస్తులు బగ్గీపై ఊరేగించారు. పాఠశాల అభివృద్ధికి ఆమె అందించిన సేవలకు ఏమిచ్చినా రుణం తీర్చుకోలేమని స్థానికులు చెప్పారు.
– సోంపేట 

చదవండి: ఏపీ: గవర్నర్‌ను కలిసిన ఎస్‌ఈసీ నీలం సాహ్ని

మరిన్ని వార్తలు