శ్రీశైలం జలాశయానికి భారీగా వరద: 10 గేట్లు ఎత్తివేత

29 Jul, 2021 14:43 IST|Sakshi

సాక్షి, కర్నూలు: ఎగువన కురుస్తోన్న వర్షాలతో శ్రీశైలం జలాశయానికి భారీగా వరద నీరు చేరుకుంటోంది. దీంతో 10 గేట్లు ఎత్తి  నాగార్జునసాగర్‌కు నీటిని విడుదల చేస్తున్నారు. ఇన్‌ఫ్లో 4,90,715 క్యూసెక్కులు కాగా, ఔట్‌ఫ్లో 4,50,071 క్యూసెక్కులు ఉంది. పూర్తిస్థాయి నీటిమట్టం 885 అడుగులు కాగా, ప్రస్తుతం 884 అడుగులకు నీటిమట్టం చేరుకుంది. పూర్తిస్థాయి నీటినిల్వ 215.807 టీఎంసీలు కాగా, ప్రస్తుతం 210.032 టీఎంసీలు ఉంది. కుడి, ఎడమ జలవిద్యుత్ కేంద్రాల్లో  విద్యుత్ ఉత్పత్తి కొనసాగుతోంది.

నాగార్జునసాగర్‌ ప్రాజెక్ట్‌కు భారీగా వరద
శ్రీశైలం ప్రాజెక్ట్ గేట్లు ఎత్తడంతో నాగార్జునసాగర్‌ ప్రాజెక్ట్‌కు వరద ప్రవాహం పెరుగుతోంది.  ఇన్‌ఫ్లో 3,57,667 క్యూసెక్కులు కాగా, ఔట్‌ఫ్లో 1000 క్యూసెక్కులుగా ఉంది.  పూర్తిస్థాయి నీటిమట్టం 590 అడుగులు కాగా, ప్రస్తుతం 544.8 అడుగులు కొనసాగుతోంది.

మరిన్ని వార్తలు