శ్రీశైల దేవస్థానం హుండీ ఆదాయం రూ.4.08 కోట్లు

8 Sep, 2022 18:36 IST|Sakshi
కానుకలు లెక్కిస్తున్న దృశ్యం

శ్రీశైలం టెంపుల్‌: శ్రీశైలదేవస్థానంలోని ఉభయ దేవాలయాల్లో ఉన్న హుండీలలో భక్తులు సమర్పించిన కానుకలను బుధవారం లెక్కించారు. ఇందులో   రూ.4,08,66,617 నగదు, 335.40 గ్రాముల బంగారం, 8.400 కేజీల వెండి ఉంది. అలాగే 378 యూఎస్‌ఏ డాలర్లు, 50 కెనడా డాలర్లు, 105 ఇంగ్లాండ్‌ ఫౌండ్స్, 70 ఆస్ట్రేలియా డాలర్లు, 70 యూఏఈ దిర్హమ్స్, 2 మలేషియా రింగిట్స్, 3 ఖతర్‌ రియాల్స్‌  తదితర విదేశీ కరెన్సీ లభించింది. 

పటిష్టమైన సీసీ కెమెరాల మధ్య అలంకార మండపంలో కానుకల లెక్కింపు జరిగింది. లెక్కించిన హుండీ కానుకలు భక్తులు గత 27 రోజుల్లో సమర్పించినవి అని దేవస్థానం ఈఓ ఎస్‌ లవన్న తెలిపారు. (క్లిక్: చూపరులను కట్టిపడేస్తోన్న.. జలసోయగం)

సాక్షి గణపతికి పూజలు 
శ్రీశైలంటెంపుల్‌: శ్రీశైల మహాక్షేత్రంలో లోక కల్యాణార్థం బుధవారం  సాక్షి గణపతి స్వామికి విశేష పూజలు నిర్వహించారు శుద్ధజలంతో అభిషేకం నిర్వహించారు. (క్లిక్: కొత్త సొబగులద్దుకున్న వైఎస్సార్‌ స్మృతివనం)

మరిన్ని వార్తలు