భువనేశ్వర్‌లో వైభవంగా శ్రీవారి ఆలయ మహాసంప్రోక్షణ 

27 May, 2022 05:54 IST|Sakshi
భువనేశ్వర్‌లో శ్రీవారి ఆలయాన్ని ప్రారంభిస్తున్న శ్రీ శారదా పీఠాధిపతి స్వరూపానందేంద్ర, ఒడిశా సీఎం నవీన్‌పట్నాయక్, గవర్నర్‌ హరిచందన్, టీటీడీ చైర్మన్‌ వైవీ సుబ్బారెడ్డి

తిరుపతి అలిపిరి/పెందుర్తి/భువనేశ్వర్‌: భువనేశ్వర్‌లో టీటీడీ నిర్మించిన శ్రీవారి ఆలయంలో గురువారం మహాసంప్రోక్షణ కనుల పండువగా జరిగింది. ఆలయాన్ని విశాఖ శారదా పీఠాధిపతి స్వరూపానందేంద్ర, ఒడిశా సీఎం నవీన్‌ పట్నాయక్, ఏపీ గవర్నర్‌ విశ్వభూషణ్‌ హరిచందన్, టీటీడీ చైర్మన్‌ వైవీ సుబ్బారెడ్డి శాస్త్రోక్తంగా ప్రారంభించారు. దేశవ్యాప్తంగా శ్రీవారి ఆలయాల నిర్మాణానికి సీఎం జగన్‌ చర్యలు తీసుకుంటున్నారని ఈ సందర్భంగా స్వరూపానందేంద్ర స్వామీజీ ప్రశంసించారు.  

మరిన్ని వార్తలు