సీఎం జగన్‌కు శ్రీవారి ఆలయ అర్చకులు కృతజ్ఞతలు

28 Mar, 2021 19:33 IST|Sakshi

సాక్షి, తిరుమల: ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డికి శ్రీవారి ఆలయ అర్చకులు కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్భంగా శ్రీవారి ఆలయ ప్రధాన అర్చకులు వేణుగోపాల దీక్షితులు మీడియాతో మాట్లాడుతూ, 1977లో అప్పటి టీడీపీ ప్రభుత్వం మిరాశి వ్యవస్థను రద్దు చేసిందని.. దీంతో గతంలో చాలా అర్చక కుటుంబాలు వీధిపాలయ్యాయన్నారు. 2007లో వైఎస్సార్‌ చేసిన చట్ట సవరణతో 26 మంది అర్చకులు కైంకర్యాలు చేసుకుంటున్నారని పేర్కొన్నారు.

అర్చక కుటుంబాల్లోని కొత్తగా 12 మంది అర్చకులను శ్రీవారి సేవ చేసుకునే అవకాశం ఇవ్వాలని సీఎం జగన్ దృష్టికి తీసుకెళ్లామని ఆయన చెప్పారు. వారికి అవకాశం కల్పిస్తామని సీఎం హామీ ఇచ్చి.. అధికారులకు ఆదేశాలిచ్చారని ఆయన వెల్లడించారు. ప్రస్తుతం రిటైరైన అర్చకులకు కూడా జీవితాంతం శ్రీవారి పాదసేవ చేసుకునే అవకాశాన్ని సీఎం జగన్‌ కల్పించారని వేణుగోపాల దీక్షితులు తెలిపారు.


చదవండి:
అత్యవసరమైతే తప్ప ప్రయాణాలొద్దు: గౌతమ్ సవాంగ్  
శ్రీకాకుళం జిల్లాలో టీడీపీకి షాక్‌..

మరిన్ని వార్తలు