మార్గదర్శిలో డబ్బుకి భద్రత ఉందా?.. ఐజీ రామకృష్ణ కీలక వ్యాఖ్యలు

28 Nov, 2022 12:51 IST|Sakshi

సాక్షి, విజయవాడ: మార్గదర్శిలో రికార్డులను సక్రమంగా నిర్వహించడం లేదని స్టాంప్స్‌ అండ్‌ రిజిస్ట్రేషన్స్‌ ఐజీ రామకృష్ణ అన్నారు. మార్గదర్శిలో డబ్బుకి భద్రత ఉందా లేదా అనే సందేహం ఉంది. సోమవారం ఆయన మీడియా సమావేశంలో మాట్లాడుతూ, రాష్ట్ర విభజన తర్వాత స్టాట్యూటరీ డాక్యుమెంట్లు ఫైల్‌ చేయలేదని.. మార్గదర్శి ఆర్థికస్థితిపై అనుమానాలున్నాయి. ప్రతి చిట్‌ వివరాలు ఇస్తేనే వాస్తవం తెలుస్తుంది. ఒక చిట్‌కు సంబంధించిన డబ్బును ఇతర వ్యాపారులకు వాడకూడదని ఐజీ తెలిపారు.

‘‘ఉషోదయ, ఉషాకిరణ్‌ సంస్థల్లో పెట్టినట్టు పేర్కొన్నారు. మార్గదర్శి ప్రజలను చీట్‌ చేసినట్టుగానే పరిగణించాలి. సమాచారం కోసం అడిగితే సహకరించడం లేదు సహకరించకపోగా మేం దుర్భాషలాడామని తప్పుడు వార్తలు రాశారు. చాలా రకాలుగా అక్రమాలు పాల్పడినందున చట్టపరంగా చర్యలు తీసుకుంటాం. వారం రోజుల్లో షోకాజ్‌ నోటీసులు ఇస్తాం. మార్గదర్శి అకౌంట్ల నిర్వహణ సక్రమంగా లేనందున స్పెషల్‌ ఆడిట్‌ చేయాలని ఆదేశించాం’’ అని ఐజీ రామకృష్ణ వెల్లడించారు. ఫోరెన్సిక్‌ ఆడిట్‌ నిర్వహించాలని ఆదేశాలు ఇస్తామన్నారు.

‘‘తెలంగాణ అధికారుల సహకారంతో హైదరాబాద్‌ సంస్థలో తనిఖీలు చేస్తాం. మాకు ఏ సంస్థపైనా వివక్ష ఉండదు. 2018లో కపిల్‌చిట్‌ఫండ్స్‌పై చర్యలు తీసుకున్నాం. 2022 వరకు కపిల్‌ చిట్‌ఫండ్స్‌కు కొత్త చిట్‌కు అనుమతి ఇవ్వలేదన్నారు. 2018లో కూడా మార్గదర్శి బ్యాంక్‌ స్టేట్‌మెంట్‌ ఇవ్వలేదని ఐజీ చెప్పారు. ఆ రోజే సెకండ్‌ అకౌంట్‌ వివరాలు ఇవ్వాలని ఆదేశించారు. కానీ ఈ రోజుకి కూడా మార్గదర్శి సెకండ్‌ అకౌండ్‌ వివరాలు ఇవ్వలేదు’’ అని ఐజీ రామకృష్ణ తెలిపారు.
చదవండి: బీజేపీకి పవన్‌ కల్యాణ్‌ వెన్నుపోటు పొడుస్తారా?

మరిన్ని వార్తలు