బీసీ కార్పొరేషన్ల ఏర్పాటుపై రాష్ట్రవ్యాప్తంగా సంబరాలు

20 Oct, 2020 03:46 IST|Sakshi
గుంటూరు నగరంపాలెంలో సీఎం వైఎస్‌ జగన్‌ చిత్రపటానికి క్షీరాభిషేకం చేస్తున్న హోం మంత్రి సుచరిత తదితరులు

సాక్షి, నెట్‌వర్క్‌: బీసీ కులాలకు ప్రాధాన్యత కల్పిస్తూ కార్పొరేషన్లు ఏర్పాటు చేయడంపై రాష్ట్రవ్యాప్తంగా ప్రజలు సంబరాలు చేసుకుంటున్నారు. సోమవారం పలుచోట్ల పూలె, అంబేడ్కర్, వైఎస్సార్‌ విగ్రహాలకు క్షీరాభిషేకం నిర్వహించారు. ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ బీసీలకు పెద్దపీట వేశారంటూ బీసీ సంఘాలు, ప్రజాప్రతినిధులు, మహిళలు సంబరాలు జరుపుకున్నారు. విజయవాడలో జరిగిన కార్యక్రమంలో ఉప ముఖ్యమంత్రి ధర్మాన కృష్ణదాస్, మంత్రులు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, అనిల్‌కుమార్‌ యాదవ్, బొత్స సత్యనారాయణ, పేర్ని వెంకట్రామయ్య, కొడాలి వెంకటేశ్వరరావు, ఎమ్మెల్యేలు జోగి రమేష్, మేకా ప్రతాప అప్పారావు తదితరులు పాల్గొన్నారు. గుంటూరు నగరంపాలెంలో మంత్రులు శ్రీరంగనాథరాజు, హోం మంత్రి మేకతోటి సుచరిత, అనంతపురంలో మంత్రి మాలగుండ్ల శంకర్‌నారాయణ పాల్గొన్నారు.

చిత్తూరులో ఉపముఖ్యమంత్రి నారాయణస్వామి, ఎంపీ రెడ్డెప్ప, ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు పూలే విగ్రహానికి క్షీరాభిషేకం చేశారు. శ్రీకాకుళంలో  రాష్ట్ర మంత్రి అప్పలరాజు, ఎమ్మెల్యే ధర్మాన ప్రసాదరావు తదితరులు వైఎస్సార్‌ విగ్రహానికి నివాళులర్పించారు. వైఎస్సార్‌ కడప జిల్లాలో పులివెందుల, వేముల, లింగాల, బద్వేలు, రైల్వేకోడూరు, ప్రొద్దుటూరు, జమ్మలమడుగు, కమలాపురం, చాపాడు, రాజంపేట తదితర ప్రాంతాల్లో సీఎం వైఎస్‌ జగన్‌ చిత్రపటానికి క్షీరాభిషేకం చేశారు.

విజయనగరం జిల్లాలో జరిగిన కార్యక్రమాల్లో ఎంపీ బెల్లాన చంద్రశేఖర్, ఎమ్మెల్యేలు శంబంగి వెంకటచినప్పలనాయుడు, బొత్స అప్పలనర్సయ్య, బడ్డుకొండ అప్పలనాయుడు, కడుబండి శ్రీనివాసరావు, అలజంగి జోగారావు, పీడిక రాజన్నదొర తదితరులు పాల్గొన్నారు. కర్నూలు జిల్లాలో కర్నూలు, వెల్దుర్తి, ఆదోని, ఆలూరు, డోన్, కోడుమూరు, నంద్యాల, ఆత్మకూరు, నందికొట్కూరు తదితర ప్రాంతాల్లో సంబరాలు జరిగాయి. విశాఖలో బీచ్‌రోడ్డు, విశాఖ దక్షిణ, మధురవాడ, ఎన్‌ఏడీ జంక్షన్, కొత్త గాజువాక, పిలకవానిపాలెంల్లో సంబరాలు చేశారు. ఆయా కార్యక్రమాల్లో ఎమ్మెల్యే తిప్పల నాగిరెడ్డి తదితరులు పాల్గొన్నారు.   

మరిన్ని వార్తలు