మిన్నంటిన ‘నూతన’ సంబరాలు

8 Apr, 2022 04:38 IST|Sakshi
సత్యసాయి జిల్లా నల్లమాడలో బైక్‌ ర్యాలీలో పార్టీ శ్రేణులు

కొత్త జిల్లాల ఏర్పాటుపై జనహర్షం

కృతజ్ఞత ర్యాలీలు, క్షీరాభిషేకాలు

సాక్షి నెట్‌వర్క్‌: కొత్త జిల్లాల ఏర్పాటుపై రాష్ట్రవ్యాప్తంగా నాలుగోరోజు గురువారం కూడా ప్రజలు సంబరాలు నిర్వహించారు. ప్రదర్శనలు, బైక్‌ ర్యాలీలు, వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి చిత్రపటాలకు క్షీరాభిషేకాలు చేశారు. పుట్టపర్తి కేంద్రంగా శ్రీసత్యసాయి జిల్లా ఏర్పాటు చేసిన సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డికి కృతజ్ఞతలు తెలుపుతూ ఎమ్మెల్యే దుద్దుకుంట శ్రీధర్‌రెడ్డి ఆధ్వర్యంలో వైఎస్సార్‌సీపీ నేతలు, కార్యకర్తలు నల్లమాడ నుంచి పుట్టపర్తి వరకు భారీ ఎత్తున బైక్‌ర్యాలీ నిర్వహించారు. జై జగన్, జైజై జగన్, థ్యాంక్యూ సీఎం సార్‌.. అంటూ ప్రజలు నినదించారు. అనంతరం సత్యమ్మ కూడలిలో భారీ బహిరంగసభ ఏర్పాటు చేశారు. శ్రీసత్యసాయి జిల్లా ఏర్పాటును హర్షిస్తూ మడకశిరలో మహిళా సంఘాల సభ్యులు సంబరాలు చేశారు. మండల పరిషత్‌ కార్యాలయ ఆవరణలో ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ చిత్రపటానికి క్షీరాభిషేకం చేశారు.

విశాఖపట్నం జిల్లాలో విశాఖ పశ్చిమ నియోజకవర్గంలో మాజీ ఎమ్మెల్యే మçళ్ల విజయప్రసాద్‌ ఆదేశాల మేరకు సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి చిత్రపటానికి క్షీరాభిషేకం చేశారు. గాజువాక నియోజకవర్గంలో 66, 70, 72, 73 వార్డులకు చెందిన వైఎస్సార్‌సీపీ కార్పొరేటర్లు, వార్డు ఇన్‌చార్జీలు ర్యాలీ నిర్వహించారు. అనకాపల్లి జిల్లా చోడవరం నియోజకవర్గంలోని రావికమతం మండలంలో వైఎస్సార్‌సీపీ నేతలు, కార్యకర్తలు 300కి పైగా బైక్‌లతో ర్యాలీ చేశారు. కృష్ణాజిల్లాలో కృత్తివెన్ను నుంచి లక్ష్మీపురం వరకు పెడన ఎమ్మెల్యే జోగి రమేష్‌ ఆధ్వర్యంలో వందలాది బైక్‌లతో ర్యాలీ నిర్వహించారు.

దారి పొడవునా ప్రజలు పూలు చల్లుతూ, బాణసంచా కాల్చుతూ తమ అభిమానాన్ని చాటుకున్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ప్రజాపాలనలో చరిత్రను లిఖించిన మహోన్నత ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి అని చెప్పారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ గరుడప్రసాద్, జెడ్పీటీసీ సభ్యురాలు రత్నకుమారి, ఏఎంసీ చైర్మన్‌ గంగాధర్‌ తదితరులు పాల్గొన్నారు. 

మరిన్ని వార్తలు