శ్రీశైలంలో పేలిన స్టీమ్‌ బాయిలర్‌ 

2 Nov, 2022 11:08 IST|Sakshi

శ్రీశైలం టెంపుల్‌(నంద్యాల జిల్లా): శ్రీశైల దేవస్థానంలోని అన్నదాన భవనం వంటశాల వద్ద ఉన్న స్టీమ్‌ బాయిలర్‌ మంగళవారం పేలింది. దేవస్థానం పరిపాలన కార్యాలయానికి దగ్గరలో అన్నదాన భవనాన్ని నిర్మించి భక్తులకు అన్నప్రసాదాలు సిద్ధం చేసి అందిస్తున్నారు. భోజనాలు సిద్ధం చేసేందుకు రెండు స్టీమ్‌ బాయిలర్‌లను వాడతారు.
చదవండి: జనసేనకు కుప్పం ఇన్‌చార్జి రాజీనామా

కార్తీకమాసం కావడంతో రోజూ 10.30 నుంచి మధ్యాహ్నం 3.30 గంటల వరకు భోజనం, క్యూలైన్‌లో వేచి ఉన్న భక్తులకు ఉదయం, సాయంత్రం అల్పాహారం అందిస్తున్నారు. ఇందుకోసం సిబ్బంది వేకువజాము నుంచే వంటలు సిద్ధం చేస్తారు. ఈ క్రమంలో మంగళవారం ఉదయం 10 గంటలకు వాటర్‌ ప్రెజర్‌ పెరిగి ఒక స్టీమ్‌ బాయిలర్‌ పేలింది. 

మరిన్ని వార్తలు