11వ శతాబ్దం నాటి విగ్రహం చోరీ 

17 Sep, 2023 04:51 IST|Sakshi
 పురాతన విగ్రహం స్థానంలో నకిలీ విగ్రహం

చంద్రగిరి (తిరుపతి జిల్లా): రాయల కాలం నాటి పురాతన విగ్రహాన్ని రాత్రికి రాత్రి చోరీ చేసి, ఎవరికీ అనుమానం రాకుండా ఆ స్థానంలో నకిలీ విగ్రహాన్ని ఏర్పాటు చేసిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఆర్కియాలజీ అధికారులు తెలిపిన వివరాల మేరకు.. చంద్రగిరి రాయలవారి కోట ప్రాంగణంలో క్రీ.శ.11వ శతాబ్ధానికి చెందిన రాతి గోడలో అప్పటి రాజులు వినాయక స్వామి­వారి విగ్రహాన్ని ప్రతిష్టించారు.

అయితే ఇటీవల ఆ విగ్రహంపై కన్నెసిన గుర్తు తెలి­యని కేటుగాళ్లు చోరీ చేశారు. అనంతరం ఎవరికీ అనుమానం రాకుండా అదే ప్రదేశంలో నకిలీ వినాయక విగ్రహాన్ని ఏర్పాటు చేసి, పూజలు నిర్వహించారు. ఈ విషయాన్ని ఆలస్యంగా గుర్తించిన ఆర్కియాలజీ అధికారులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. పురాతన విగ్రహం లోపల భాగంలో నిధులుంటాయని, వాటిని సొంతం చేసుకోవడానికే విగ్రహాన్ని చోరీ చేసి ఉంటారని   ప్రచారం చక్కర్లు కొడుతోంది.
 

మరిన్ని వార్తలు