వింత ఆచారం: వరుడు వధువుగా.. వధువు వరుడిగా..

22 May, 2022 06:19 IST|Sakshi
వధూవరుల వేషధారణలో మార్పు

దొనకొండ(ప్రకాశం జిల్లా): పెళ్లి తంతులో వరుడు వధువుగా, వధువు వరుడిగా వేషాలు మార్చుకునే వింత ఆచారాన్ని ప్రకాశం జిల్లా దొనకొండ మండలంలోని ఇండ్లచెరువు, దేశిరెడ్డిపల్లి గ్రామాల్లోని గుమ్మా కుటుంబం వారు పాటిస్తున్నారు. తమ ఇళ్లలో వివాహం జరిగితే.. తాము కొలిచే ఎల్లమ్మ దేవత ఆచారం ప్రకారం వివాహమైన మరుసటి రోజు వధువు వరుని వేషం, వరుడు వధువు వేషం వేసి నాగుల పుట్ట దగ్గరకు వెళ్లి మొక్కులు తీర్చుకుంటారు.

బొల్లావు సంబరాలతో వధూవరులు గ్రామ పురవీధుల్లో తప్పెట్లు, కొమ్ము ఊదుకుంటూ ఊరేగింపుగా పుట్ట దగ్గరికి వెళతారు. ఇండ్లచెరువుకు చెందిన గుమ్మా వంశానికి చెందిన వారు వివాహ సందర్భంగా శనివారం ఇలా వేషాలు మార్చుకుని మొక్కులు తీర్చుకున్నారు.   

మరిన్ని వార్తలు