ఏంటా వింత వస్తువు?!

31 Jul, 2021 08:47 IST|Sakshi
వింత వస్తువు

కూరపర్తివారిపల్లె పంచాయతీ లచ్చాయకుంట సమీపంలో బ్యాటరీ, సిగ్నల్‌ డిటెక్టర్, గొడుగు, బెలూన్లతో కూడిన ఎలక్ట్రానిక్‌ పరికరం శుక్రవారం కలకలం రేపింది. సమాచారం అందుకున్న ఎస్‌ఐ వెంకటమోహన్‌ అక్కడకు చేరుకుని దాన్ని స్వాధీనం చేసుకున్నారు. వాతావరణ అధ్యయనానికి పరిశోధకులు గాల్లోకి బెలూన్‌ సాయంతో దీన్ని పంపి ఉండొచ్చని ప్రాథమికంగా నిర్థారణకొచ్చారు. దీనిగురించి ఎలాంటి ఆందోళన అవసరం లేదన్నారు.
– ఎర్రావారిపాళెం(చిత్తూరు జిల్లా)

మరిన్ని వార్తలు