రోగుల నుంచి తీసుకున్న‌దానికి 10 రెట్లు పెనాల్టీ

19 Oct, 2020 14:24 IST|Sakshi

అమరావతి :  డ‌బ్బులు క‌డితేనే  చేర్చుకుంటామ‌న్న ఎంప్లాయిస్ హెల్త్ స్కీం నెట్‌వ‌ర్క్ ఆసుపత్రులపై ఆరోగ్యశ్రీ ట్ర‌స్ట్ సీరియ‌స్  అయ్యింది. ఆరోగ్య శ్రీ ఉన్నా మొద‌ట డ‌బ్బులు క‌ట్టాల‌ని త‌ర్వాతే రీయింబ‌ర్స్‌మెంట్ పెట్టుకోవాల‌ని ఆసుపత్రులు ఉద్యోగుల‌కు సూచిస్తున్న‌ట్లు స‌మాచారం. ఈ అంశాన్ని సీరియస్‌గా తీసుకున్న ఆరోగ్య శ్రీ ట్రస్ట్  ఎంప్లాయిస్ హెల్త్ స్కీం నెట్‌వ‌ర్క్ ఆసుపత్రులకు హెచ్చ‌రిక‌లు జారీ చేసింది.  డబ్బులు తీసుకోవడం, క్యాష్ పేమెంట్ డిమాండ్ చేయడం లాంటివి చేస్తే చర్యలు ఉంటాయ‌ని పేర్కొంది.

 రోగుల వద్ద తీసుకున్న డబ్బులకు 10 రెట్లు ఎక్కువ  పెనాల్టీ వేస్తాం అని హెచ్చరికలు జారీ చేసింది.  అలాంటి ఆసుపత్రులను ప్ర‌భుత్వం నుంచి ల‌భించే అన్ని  స్కీంల నుంచి మూడు నెలలు సస్పెండ్ చేయాలని నిర్ణయించాయి.  ఈనెల 13న  ఆరోగ్య శ్రీ ట్రస్ట్ నెట్‌వ‌ర్క్ ఆసుపత్రులకు రూ. 31 కోట్ల రూపాయ‌ల‌ను  విడుదల చేసింది. ఇప్పటికే ఆసుపత్రుల బకాయిలు దాదాపు చెల్లించిన ప్ర‌భుత్వం..మరికొద్ది రోజుల్లో మరో 16 కోట్ల రూపాయల విడుదల చేయ‌నుంది. 
 

మరిన్ని వార్తలు